Brahmamudi : రుద్రాణి ప్లాన్ ఫెయిల్.. ఇబ్బందిగా ఉందని చెప్పిన రాజ్!
on Apr 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -686 లో.. రాజ్ తో కావ్య అలా పరాయిదానిలాగా మాట్లాడడం భరించలేకపోతుంది. నేను మళ్ళీ కలుస్తానంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. కావ్య వెళ్ళిపోగానే యామిని వస్తుంది. బావ కాఫీ తాగుదామా అంటుంది. వద్దు నేను వెళ్తున్నానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. మరొకవైపు యామిని గురించి అప్పు ఎంక్వయిరీ చేయిస్తుంది. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నాకు కావ్య మాటలతో ఆశ కలుగుతుందని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది. కావ్య తనలో తను మాట్లాడుకుంటున్న వీడియోని రుద్రాణి అందరికి చూపించాలనుకుంటుంది. అందరి దృష్టిలో కావ్యని పిచ్చిదాన్ని చెయ్యాలనుకుంటుంది.
రుద్రాణి ఇంటికి వచ్చి కావ్య మాటలు నమ్మి మీరు మోసపోతున్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ వీడియోని టీవీలో ప్లే చేస్తుంది. అదంతా చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. తనలో తాను భ్రమలో బ్రతుకుతున్న కావ్యని చూసి అపర్ణ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అయిన మీరు నన్ను ఫాలో అవుతు ఎందుకు వచ్చారని రుద్రాణిని కావ్య అడుగుతుంది. ఫాలో అయింది మ్యాటర్ కాదు.. ఆ వీడియోలో ఉంది నిజమని రుద్రాణి అంటుంది. నాలో నేను ఏం మాట్లాడుకోవడం లేదు.. ఫోన్ మాట్లాడుతున్నా చూడు చెవిలో బ్లూ టూత్ పెట్టుకున్నానని వీడియో జూమ్ చేసి చూపిస్తుంది. క్లయింట్స్ ఎక్కడ వరకు వచ్చారో కనుకుంటున్నానని కావ్య చెప్తుంది. రాహుల్ , రుద్రాణి ఇద్దరు తమని ఫాలో అవుతూ వచ్చారని గమనించి కావాలనే బ్లూ టూత్ పెట్టుకుంటున్న విషయం గుర్తు చేసుకుంటుంది కావ్య. దాంతో ఇంట్లో అందరూ రుద్రాణి వంక కోపంగా చూస్తారు. ప్లాన్ ఫెయిల్ అయిందా అని రుద్రాణిపై స్వప్న విరుచుకుపడుతుంది.
ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రాకు.. నాకు చాలా ఇబ్బందిగా ఉందని యామినీతో రాజ్ చెప్తాడు. నువ్వు రాజ్ కి కోపం తెప్పించే పని చెయ్యకు విసుగొచ్చి ఎక్కడికైనా వెళ్తే పరిస్థితి ఏంటని యామినితో వైదేహి అంటుంది. మరొకవైపు కావ్య ఇలా భ్రమలో బ్రతుకుతుందని అపర్ణ బాధపడుతుంటే.. ఇందిరాదేవి, సుభాష్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. అపర్ణ లిఫ్ట్ చేయబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
