Brahmamudi : బెడ్ పై రాజ్, కావ్య.. నందగోపాల్ దొరికేస్తాడా!
on Jan 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -608 లో..... ధాన్యలక్ష్మి రుద్రాణిలు కలిసి కావ్య కార్లని పంపించేసింది.. తనని అడగండని అపర్ణతో చెప్తారు. కావ్యకి అపర్ణ ఫోన్ చెయ్యగా.. బిజీ అని చెప్తుంది. కావ్య ఇంటికి వచ్చాక మాట్లాడుదామని అపర్ణ అంటుంటే అయిన కావాలనే కావ్య ఇలా చేస్తుంది.. అలా చేస్తుందటూ తిడుతుంటారు.
మరొకవైపు మేనేజర్ దగ్గరికి కావ్య వచ్చి డబ్బు వాడేటప్పుడు నాకు చెప్పాలని చెప్తుంది. అప్పుడే ఒక ఎంప్లాయి మేనేజర్ దగ్గరికి వచ్చి సాలరీ అడ్వాన్స్ కావాలని అంటాడు. అకౌంట్ లో డబ్బు లేక మేము ఇబ్బంది పడుతుంటే.. నీకు డబ్బు కావాలా అంటూ మేనేజర్ కోప్పడతాడు. ఇంత పెద్ద కంపెనీ ఉంది అడ్వాన్స్ అడిగితే లేవట అంటూ ఎంప్లాయి వెళ్లి వేరే వాళ్ళతో చెప్తాడు. అంటే ఈ కంపెనీ లాస్ లో ఉందా? తీసేస్తారా ఏంటి అని ఎంప్లాయిస్ మాట్లాడుకుంటుంటే.. అదంతా కావ్య విని వాళ్ళ పైన కోప్పడతుంది. అసలు మీకు ఎవరు చెప్పారు. కంపెనీ లాస్ లో ఉందని అంటు కావ్య వాళ్ళపై విరుచుకుపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి అదంతా వింటాడు. మరొకవైపు అనామిక దగ్గరికి నందగోపాల్ వస్తాడు. మేడమ్ మీరు చెప్పినట్లే బోర్డు తిప్పేసాను.. ఇప్పుడేం చెయ్యాలని నందగోపాల్ అనామికతో చెప్తూ టెన్షన్ పడతాడు. నువ్వేం కంగారు పడకు రాజ్ ఆల్రెడీ ఇరవై కోట్లు కట్టాడు.. అప్పు చేసి అయినా మిగతాది కట్టేస్తాడు కానీ నువ్వు ఒక మూడు నెలల బయటకు రాకుండా ఉండమని నందగోపాల్ తో అనామిక అంటుంది. సరే అంటూ నందగోపాల్ బయటకు వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒక మూడు నెలల పండుగ.. నేను చెప్పిన అడ్రెస్ కి రా అంటు ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత రాజ్ కి తన పోలీస్ ఫ్రెండ్ ఫోన్ చేసి నందగోపాల్ ఫారెన్ వెళ్ళలేదని చెప్తాడు. నేను నా భార్య వాడి ఫోన్ ట్రాప్ చేసి వస్తామని రాజ్ తన ఫ్రెండ్ తో చెప్తాడు.
మరొకవైపు ఇంట్లో అదే పనిగా రుద్రాణి, ధాన్యలక్ష్మికి కావ్య గురించి నెగటివ్ గా చెప్తుంది. ఇక ఆ కావ్య ఏం చెసిన అడ్డు చెప్పాలని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య వెళ్తుంటే ఒకతను కార్ కి అడ్డుపడి.. పెళ్లిచూపులకి వెళ్తున్నానంటూ లిఫ్ట్ అడుగుతాడు. సరే అంటు రాజ్ అతన్ని ఎక్కించుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్యలు నందగోపాల్ అడ్రెస్ తెలుసుకొని వెళ్తారు. వెళ్లేసరికి బెడ్ రూమ్ డెకరేషన్ చేసి ఉంటుంది. కావ్య, రాజ్ లు పొరపాటుగా బెడ్ పై పడిపోతారు. అప్పుడే నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read