Brahmamudi : అక్కని మరోసారి అవమానించిన చెల్లి.. ఆమె మాటతో ప్రకాష్ నిలదీస్తాడా!
on Dec 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -604 లో.... నన్ను ఆపే అధికారం మీ అత్తగారికి లేదు.. మా అత్త గారికి లేదని ధాన్యలక్ష్మికి మాస్ వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇక రాజ్ అయితే నా భార్య చేసేది కరెక్ట్ దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఏం చేసినా ఈ ఇంటి కోసం చేస్తుంది.. ఎక్కువ మాట్లాడితే మీ అందరిని ఉద్యోగం చేసుకొని బతకమంటుంది.. అంతవరకు తెచ్చుకోకండి అని అందరికి చెప్తాడు. ఆ తర్వాత కావ్యని గదిలోకి తీసుకొని వెళ్తాడు రాజ్. అది చూసి సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరొకవైపు కావ్య అందరి ముందు తిట్టిందని స్వప్న బాధపడుతుంటే.. రాహుల్, రుద్రాణిలు వచ్చి ఇంకా కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడతారు. ఇప్పటికైనా నీ చెల్లి నిజస్వరూపం తెలిసిందా ఇప్పటికైనా మాతో ఉండు.. ఫ్యామిలీ అంటే మేమే.. మనం కలిసి ఆస్తులు సొంతం చేసుకుందామని రుద్రాణి అనగానే.. నా చెల్లి నన్ను తిట్టింది మీకేంటి అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది స్వప్న. ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. నేను నీ అక్కనేనా అందరి ముందు నన్ను అలా అవమానించావని అడుగుతుంది. నన్ను ఈ కుటుంబంలో మెంబర్ కాదన్నట్లు మాట్లాడావని అంటుంది. అది కాదు అక్క నేను డబ్బు మొత్తం పుట్టింటికి చేరవేస్తున్నానని అంటున్నారంటూ కావ్య అంటుంది. నువ్వు ఆస్తులు చేతికి వచ్చాక నీలో మార్పు వచ్చిందని స్వప్న అనగానే కావ్య కోప్పడుతుంది. దాంతో స్వప్న బాధపడుతూ వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంత జరిగినా ఏం అడగలేదని ప్రకాష్ తో ధాన్యలక్ష్మి అంటుంది. సరే అడుగుతానులే అని ప్రకాష్ అంటాడు.
ఆ తర్వాత నువ్వు అందరి ముందు స్వప్నని తిట్టకుండా ఉండాల్సిందని కావ్యతో రాజ్ అంటాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పేనని కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలని రాజ్ అంటాడు. స్వప్న అక్క నగలు ఇచ్చింది కదా అవి అమ్మి డబ్బు తీసుకుందామని కావ్య అనగానే వద్దని రాజ్ అంటాడు. ఆ తర్వాత మీ వాళ్లని అడుగుతానన్నారు కదా పదండి అడగండి అంటూ ప్రకాష్ ని తీసుకుని వస్తుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read