Brahmamudi : చెల్లెలు మీద కోపంతో నగలు వద్దన్న అక్క.. ఇంటి పెత్తనం మొత్తం కావ్యకే!
on Dec 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -603 లో.... కావ్య, రాజ్ ఇద్దరు మిగతా పది లక్షలు ఏం అయ్యాయని ఆలోచిస్తారు. మరొకవైపు ఆకలిగా ఉందని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు పనిమనిషి దగ్గరికి వెళ్తారు. అయ్యో అన్నం వద్దన్నారు.. వేస్ట్ అవుతుందని ముష్టి వాళ్ళకి వేసానని పనిమనిషి అనగానే.. మాకు ఆకలిగా ఉంది మళ్ళీ వంట చేయమని రుద్రాణి అనగానే.. కావ్య మేడమ్ ని అడగాలని పనిమనిషి అనగానే వాళ్ళకి కోపం వస్తుంది.
అప్పుడే స్వప్న వస్తుంది. ఒకసారి నన్ను చూడండి. నా నెక్లెస్ ఎలా ఉందని అడుగుతుంది. పది లక్షలని స్వప్న అనగానే.. అంత డబ్బు నీకు ఎక్కడిదని రుద్రాణి అనగానే.. మా చెల్లి కావ్య ఇచ్చిందని అంటుంది. మాకు ఇలా చేస్తుంది నీకు ఏకంగా అంత డబ్బు ఇచ్చిందా అని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు అంటారు. వెంటనే కోపంగా అపర్ణ, సుభాష్ ల దగ్గరికి వెళ్లి.. మా కార్డ్స్ బ్లాక్ చేశారు కానీ స్వప్నకి పది లక్షలు ఇచ్చిందని చెప్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఆ తర్వాత కావ్య ఎప్పుడు అలా చెయ్యద్దని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత కావ్య, రాజ్ లు వస్తారు. వచ్చావా మా కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేసావని అడుగుతారు. అనవసరం ఖర్చు చేస్తారనని కావ్య అనగానే.. అయితే మీ అక్కకి నగలు కొనియొచ్చా అని ధాన్యలక్ష్మి అనగానే.. ఏం అంటున్నారని స్వప్నని పిలుస్తుంది కావ్య. ఆ నగలకి డబ్బు ఎక్కడివి అనగానే.. నువ్వే ఇచ్చావ్ కదా అంటుంది. నేను నగలు కొనుక్కోమ్మని ఇచ్చానా అని కావ్య అంటుంది.
ఏం నాటకం ఆడుతున్నారని రుద్రాణి అంటుంది. నా భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దు ఇంట్లో అవసరం అయితే ఈ చెక్ వాడు అని స్వప్నకి కావ్య చెక్ ఇవ్వడం నేను చూసానని రాజ్ అంటాడు. నీకు నేనేం అని చెప్పి ఇచ్చానని స్వప్నని కావ్య అడుగుతుంది. ఇంట్లో అవసరం అయితే ఇవ్వమన్నావ్ కానీ ఎవరు అడగలేదు. అందుకే వాడుకున్నానని స్వప్న అనగానే.. నీకు ఇలా అనవసరం ఖర్చు చెయ్యమనే హక్కు ఎవరు ఇచ్చారని స్వప్న పైన కావ్య కోప్పడుతుంటే.. నీ నగలు ఏం వద్దు .. ఇంత అవమానిస్తావా అంటూ స్వప్న నగలు తీసి ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరు నేను చెప్పిందే వినాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో సీతారామయ్య హాస్పిటల్ బిల్ కట్టలేదని సుభాష్ కి ఫోన్ చెయ్యడంతో.. కావ్యని పిలిచి ఎందుకు కట్టలేదని అడుగుతాడు. మావయ్య గారి బిల్ కూడా అనవసరం అనిపించిందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు ఏమో జరుగుతుంది. వీళ్ళు చెప్పడం లేదని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read