Brahmamudi : కోడలికి భాద్యతలు చెప్పిన అత్త.. ఆయనెందుకు టెన్షన్ లో ఉన్నాడు!
on Dec 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -596 లో.... అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది. ఈ బాధ్యతలు నాకు వద్దని అంటుంది. అది బరువు అనుకోకు బాధ్యతలా ఫీల్ అవ్వు.. ఎవరు అడిగిన వాళ్ళ అవసరం అడుగు.. అవసరం అయితేనే ఇవ్వు.. అప్పుడే నీ నైపుణ్యం తెలుస్తుందని కావ్యకి అపర్ణ చెప్తుంది. మీరు అందుకే ఈ బాధ్యతలు అప్పజెప్పారా అని కావ్య అనగానే.. నీకు అలవాటు అవుతుందని ఇచ్చానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవరు వచ్చి డబ్బులు అడిగినా ఇస్తారన్నమాట అయితే నేను కూడా డబ్బులు సంపాదించాలని రాహుల్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి సీతారామయ్య గారు నాకు డబ్బులు ఇస్తా అన్నారని అడుగమని రాహుల్ మాట్లాడుతుంటే.. అప్పుడే స్వప్న వచ్చి రాహుల్ నీ తిడుతుంది. రుద్రాణికి కూడా రాహుల్ భాగోతం చెప్పగానే.. తను కూడ స్వప్న వెళ్ళిపోయాక చివాట్లు పెడుతుంది.
మరొకవైపు రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కాల్ చేసి.. ఇంటి బయటున్నాను అంటాడు. రాజ్ బయటకు వెళ్లి ఆ నందగోపాల్ గురించి మాట్లాడుతుంటే అప్పుడే కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. నీకు బుద్ది ఉందా మాట్లాడుకుంటుంటే సడెన్ గా వస్తావంటూ కావ్యపై రాజ్ చిరాకుపడుతుంటే అపర్ణ చూసి రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఆఫీస్ లో కలుస్తానంటూ తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేరొకరి ముందు భార్యని అవమానించడం ఎప్పుడు నేర్చుకున్నావని అపర్ణ కోప్పడగానే.. కావ్యకి సారీ చెప్తాడు రాజ్. అసలు ఎందుకు ఆయన చిరాకుగా టెన్షన్ గా ఉన్నారు కనుక్కోవాలని కావ్య అనుకుంటుంది.
ఆ తర్వాత దుగ్గిరాల ఇంటికి బ్యాంక్ నుండి ఇద్దరు ఆఫీసర్స్ వస్తారు. తన ఫ్రెండ్ కి సీతారామయ్య గారు వంద కోట్లకి షూరిటి పెట్టారు. రాజ్ గారికి ఈ విషయం చెప్తే రెస్పాండ్ అవ్వలేదు. ఈ ఆస్తులు జప్తు చేస్తామనగానే.. రుద్రాణి, ధాన్యలక్ష్మి లు టెన్షన్ పడుతు.. నేను ఎప్పటి నుండి చెప్తున్నా.. ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికీ కాకుండాపోయంటూ సీతారామయ్యని తిడతారు. తరువాయి భాగంలో కావ్యకి హెల్ప్ చేస్తానంటూ రాజ్ వస్తాడు. అయితే ఆ ఫ్యాన్ క్లీన్ చెయ్యండి అని కావ్య అనగానే.. రాజ్ క్లీన్ చేస్తుంటాడు. దాంతో స్లిప్ అయి కిందే ఉన్న కావ్య మీద పడిపోతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.