Brahmamudi: పడి పడి నవ్విన కావ్య.. రాజ్ చేసిన ఆ పనికి రుద్రాణికి మంట!
on Nov 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-580 లో.. దుగ్గిరాల ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తుంది కావ్య. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర సీతారామయ్య, ఇందిరాదేవి కలిసి కావ్య తెచ్చిన ఇంటి భోజనం కూర్చొని తింటుంటారు. ఇంతలో రాజ్ వచ్చి.. మన కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. స్పైసీ బిర్యానీ అని చెప్తాడు. ఇక ఓ వైపు సీతారామయ్య, ఇందిరాదేవి , సుభాష్ కలిసి కావ్య తెచ్చిన భోజనం తింటుంటే.. రాజ్ తెచ్చిన బిర్యానీ ఒక్క మద్ద రుద్రాణి తినేసరికి అలానే ఆగిపోతారు. ఫుల్ స్పైసీగా ఉండటంతో రాజ్, రుద్రాణి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు.
స్వప్న తన చెల్లెలు కావ్యతో.. ఏం బాలు మా అత్త బ్రెయిన్‌లా చెత్తగా ఉంది.. కావ్యా నాకు నువ్వు తెచ్చిందే పెట్టవే అంటుంది. ప్రకాశం కూడా అదే మాట అనడంతో.. బాబాయ్ నేను ఎంత మమగారంతో తెప్పించాను బాబాయ్ బిర్యానీ అని రాజ్ అంటాడు. కానీ ఇది యమకారంగా ఉందిరా.. నా వల్ల కాదని ప్రకాశం అనగానే.. సుభాష్ కూడా పార్టీ మార్చేసి కావ్యను రిక్వస్ట్ చేస్తాడు. కావ్య నవ్వుకుంటూ.. మావయ్యగారు ఇంట్లో అందరికి సరిపోయేలానే తెచ్చాను. అంతా తినొచ్చని రాజ్‌ని ఉద్దేశించి అంటుంది. టేస్టీ పప్పు అంటుంది కావ్య కావాలనే ఊరించడానికి.. పప్పుతో మమ్మల్ని కొనలేరని రాజ్ అంటాడు. మీ బిర్యానీ మనుషులతో తినిపించలేరని కావ్య అంటుంది. వెంటనే రాహుల్ తినలేక మంటలతో.. మమ్మీ నేను అటు మారిపోతానంటాడు. నోరుమూసుకుని తిను అని రుద్రాణి చంపేస్తానంటుంది. వెంటనే స్వప్న.. మీ మమ్మీ అలానే ఉంటుంది కానీ.. నువ్వు ఇది తిను.. నేను ఇంకో ప్లేట్ తీసుకుంటానులేనని తాను తినే కావ్య పప్పు అన్నం రాహుల్‌కి ఇస్తుంది. వెంటనే కావ్య.. అవును రాహుల్ నువ్వు తిను.. అక్కకి మరో ప్లేట్ ఇస్తానంటుంది. వెంటనే రాహుల్ నవ్వుకుంటూ హ్యాపీగా తినడం స్టార్ట్ చేస్తాడు.
ఇక ఇద్దరు ఫుల్ కారం అంటు రాజ్, రుద్రాణి నోటిని కడుక్కుంటారు. అది చూసి కావ్యతో పాటు మిగిలిన వాళ్ళంతా నువ్వుకుంటారు. ఇక దాని తర్వాత కాసేపటికి కావ్య.. అందరికి కాఫీ తెచ్చి పంచి.. కావ్య బయలుదేర్తుంటుంది. అప్పుడే రేపేం కావాలో లిస్ట్ చెబుతారు ప్రకాశం వాళ్లు. ఇంతలో రాజ్ కిందకు దిగుతూ.. ఆగు అంటాడు. కావ్యకు డబ్బు అందిస్తూ.. మీరు తెచ్చిన ఫుల్ మీల్స్‌కి నేను చెల్లిస్తున్న బిల్.. నువ్వు చేసిన సర్వీస్‌కి మొత్తం డబ్బులు.. తీసుకో.. మా వాళ్లంతా బాగా తిన్నారంటాడు. ఇక కావ్య ఊరుకోదు. ఏం అనుకుంటున్నారు నా గురించి.. గతంలో కూడా డబ్బు ఇస్తాను ఇంటికి కోడలిగా రా అన్నారు. ఇప్పుడు ఇలా.. అసలు ఏంటి మీ ఉద్దేశమంటూ అందరి ముందే కావ్య గొడవకు దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read