Brahmamudi : కొంపముంచిన వేళం పాట.. అటు అనామికకి, ఇటు రాజ్ కి ఒకేసారి!
on Oct 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -554 లో.....కావ్య దగ్గరికి అరవింద్ వచ్చి మా కంపెనీని తీసుకోండి అని అంటాడు. మీ కంపెనీ కి లాభం వచ్చేలా చేస్తాను. లాభం ఫిఫ్టీ ఫిఫ్టీ అని కావ్య అరవింద్ తో డీలింగ్ పెట్టుకుంటుంది. రాజ్ కి మాత్రం వేళంలో అరవింద్ కంపెనీ ని తీసుకుంటున్నానని చెప్తుంది. దాంతో రాజ్ నష్టంలో ఉన్న కంపెనీ మనకి ఎందుకంటూ కోప్పడతాడు. మీరు మేనేజర్ అంటూ కావ్య ఆటిట్యూడ్ చూపిస్తుంది.
ఆ తర్వాత స్వప్నకి కావ్య ఫోన్ చేస్తుంది. నీ అత్త మీద పగ తీర్చుకునే టైమ్ వచ్చిందంటు స్వప్నకి ఒక ప్లాన్ చెప్తుంది కావ్య. సరే ఇక నేను చూసుకుంటానని స్వప్న అంటుంది.bఆ తర్వాత స్వప్న రాహుల్, రుద్రాణిలకి వినపడేలా.. ఏంటి కావ్య నువ్వు చెప్పేది అరవింద్ కంపెనీని వేళంలో తీసుకుంటున్నావా.. కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే ఫారెనర్స్ ఇన్వెస్టర్లున్నారా.. నువ్వు చాలా గ్రేట్ వేళంలో ఎలాగైనా కంపెనీని సొంతం చేసుకోమని స్వప్న అంటుంది. ఆ తర్వాత అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా.. ఏం తెలియనట్లు రుద్రాణి, రాహుల్ ని అనగానే.. ఏంటో మాట్లాడుతున్నావని రుద్రాణి అంటుంది. నేను చెప్పను.. మళ్ళీ ఏదో ప్లాన్ చేసి అది జరగకుండా చేస్తారని స్వప్న అంటుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. అరవింద్ కంపెనీని కావ్య వేళంలో తీసుకుంటుందంట తనకి రావద్దు.. నువ్వే ఆ కంపెనీని తీసుకోవాలని రుద్రాణి అనగానే.. అనామిక సరే అంటుంది.
ఆ తర్వాత రాజ్ ఇంటికి వచ్చి.. మీ మనవరాలు ఇలా చేస్తుందంటూ చెప్తాడు. తన సామర్థ్యం గురించి నాకు తెలుసని రాజ్ పై సీతారామయ్య సీరియస్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్ రాసిన పాట యావరేజ్ గా ఉందని రైటర్ అంటాడు. అయిదు వేలు ఇస్తానని చెప్తాడు. కానీ పాటలు బాగా రాస్తుండు, మన గ్రిప్ లో ఉంచుకోవాలి అని రైటర్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి సీతారామయ్య కాల్ చేసి.. నువ్వు ఏది చేసిన నమ్మకం ఉందని చెప్తాడు.
తరువాయి భాగంలో కావ్య కంటే ఎక్కువ వేళం పాడి అరవింద్ కంపెనీని సొంతం చేసుకుంటుంది అనామిక. అప్పుడే అరవింద్ వచ్చి లాభానికి నా కంపెనీని వెళ్లేలా చేశారు. మీ లాభం పదిహేను కోట్లు.. నా లాభం పదిహేను కోట్లు అనగానే రాజ్ ఒక వైపు.. అనామిక ఒక వైపు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read