ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : అవార్డు అందుకున్న కావ్య.. రాజ్ మాటలకి ముక్కలైన మనసు!

on Oct 4, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -531 లో.....స్వప్నతో కావ్య ఎక్స్పో దగ్గర మాట్లాడుతుంది. అసలు భార్యని అర్ధం చేసుకోలేని మగాడితో ఏం సంసారం చేస్తాం అక్క అని కావ్య తన బాధని స్వప్నతో పంచుకుంటుంది. ఆ తర్వాత కావ్య లోపలికి వెళ్లి కూర్చుంటుంది. రాజ్ వాళ్లు ఒకవైపు కూర్చొని ఉంటారు. అదంతా లైవ్ లో అపర్ణ వాళ్లు చూస్తుంటారు.

ఆ తర్వాత ఎంతగానో ఎదరుచూస్తున్న టైమ్ రానే వచ్చింది.‌ గత కొంతకాలంగా ఈ అవార్డు స్వరాజ్ గ్రూప్ వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు.‌ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందో చూడాలని ఎక్స్పో మేనేజర్ అంటాడు. ఇప్పుడు ఈ కవర్ లో ఎవరి పేరు ఉంటే వాళ్లే ఈ అవార్డు విన్నర్ అని చెప్తూ అది ఓపెన్ చేస్తాడు. నువ్వే రాజ్ నిలబడు అంటూ రుద్రాణి అనగానే.. రాజ్ లేవబోతుంటే ఈ సంవత్సరం అవార్డు గెలుచుకుంది సామంత్ గ్రూప్ అనగానే అందరు ఆశ్చర్యపోతారు. సామంత్ స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడతాడు. నాకు ఈ అవార్డు రావడానికి కారణం ఇద్దరు స్త్రీలు.. ఒకరు అనామిక అంటూ స్టేజ్ పైకి పిలుస్తాడు. నాకు సపోర్ట్ గా ఉంటూ వస్తుంది నాకు కాబోయే భార్య అనామిక అని అందరికి పరిచయం చేస్తాడు. నా విజయానికి కారణం ఇంకొక స్త్రీ తనే మిస్సెస్ కావ్య అని అనగానే అందరు షాక్ అవుతారు. అసలేంటి ఏం అంటున్నారని కావ్య తన బాస్ ని అడుగుతుంది. బినామీ గా ఆ కంపెనీకీ ఉన్నామని అతను చెప్తాడు. రండి కావ్య గారు ఈ అవార్డు మీరే తీసుకోవాలని కావ్యని స్టేజి పైకి పిలుస్తారు. కావ్య బలవంతంగా అవార్డు అందుకుంటుంది. రాజ్ పై గెలిచానన్న గర్వం సామంత్, అనామికలో కన్పిస్తుంది. మరొకవైపు కావ్య ఏంటి వాళ్లకు సపోర్ట్ చెయ్యడమేంటని అపర్ణ వాళ్ళు అనుకుంటారు.

ఆ తర్వాత కావ్య వస్తుంటే.. అందరూ మీడియా వాళ్లు చుట్టూ ముట్టి ప్రశ్నలు వేస్తుంటారు. కావ్య బాధగా బయటకు వెళ్తుంది. అప్పుడే రాజ్ వాళ్ళు వస్తుంటారు. కంగ్రాట్స్ అంటూ రాజ్ కోపంతో కూడిన బాధతో మాట్లాడతాడు. నువ్వు ఏంటో.. నీ నిజస్వరూపం ఏంటో తెలిసిందని రాజ్ అంటాడు. కావ్య చేప్పే ప్రయత్నం చేసిన రాజ్ వినడు. తరువాయి భాగంలో నీపై ఏ మూలనో కొంచెం ప్రేమ ఉండేది.. దాన్ని ఈ రోజుతో చంపేశావ్.. ఇంకెప్పుడు నాకు ఎదురుపడకని రాజ్ చెప్పగానే.. కావ్య మనసు ముక్కలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.