Brahmamudi : నీ కొడుకు వల్లే వెళ్లిపోయింది.. షాక్ లో అత్త!
on Sep 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -515 లో... ఇందిరాదేవి రాజ్ దగ్గరకి వచ్చి కావ్యని తీసుకొని రమ్మని చెప్తుంది. నేను తీసుకొని రాను.. నేను వెళ్ళామనలేదు.. అలా అని తీసుకొని రాలేను.. నా తల్లికి ఆ పరిస్థితి రావడనికి కారణం అయిన తనని అసలు క్షమించనని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య బాధపడుతుంటే.. అప్పుడే అప్పు వస్తుంది. అప్పు బాధపడుతూ కావ్యని వచ్చి హగ్ చేసుకొని ఏడుస్తుంది. నువ్వు ఏడవడం ఫస్ట్ టైమ్ చూస్తున్న అని ఏడవకని అప్పుకు కావ్య చెప్తుంది. ఇదంతా మా పెళ్లి వల్లే అని అప్పు అంటుంది. మీ పెళ్లి వల్ల కాదు.. పెళ్లి జరిగేటప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ ఇన్ని రోజులైనా నా గురించి మా ఆయనకి తెలియకపోవడం వళ్లే ఇదంతా.. ఇంకా ఎన్ని రోజులు అతని మనసులో స్థానం కోసం ప్రయత్నం చేయాలి.. లేదు ఇక ఒకదాన్నే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కావ్య అంటుంది.
మరొకవైపు అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి బాధపడుతుంటే.. తను స్పృహలోకి వస్తుంది. దాంతో సుభాష్ వెళ్లి అందరికి చెప్తాడు. అందరూ తను స్పృహలోకి వచ్చినందుకు హ్యాపీ కగా ఫీల్ అవుతారు. అపర్ణ అందరిని చూస్తుంది కావ్య ఎక్కడా అని అడుగుతుంది. దాంతో రాజ్ డైవర్ట్ చేసి.. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుతానంటూ వెళ్తాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చాక ఆమెకి షాకింగ్ కలిగే విషయాలు చెప్పకండి అని చెప్తుంది. ఆ తర్వాత కావ్యని అపర్ణ అడుగుతుందని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. ఇది నీ కాపురానికి సంబంధించిన విషయం కాదు.. మీ అమ్మ ప్రాణానికి సంబందించినది అని ఇందిరాదేవి అడుగుతుంది. నాకేం తెలియదు ఇప్పుడు నన్నేం అడగకండి అని రాజ్ వెళ్ళిపోతాడు. రాజ్, కావ్యలని అపర్ణ కలుపుతుందని సుభాష్ అంటాడు.
ఆ తర్వాత స్వప్నకి కావ్య ఫోన్ చేసి అపర్ణ గురించి అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత కావ్య జాబ్ చూసుకోవడానికి బయటకు వెళ్తుంటే.. కనకం వద్దని అంటుంది. కృష్ణమూర్తి వెళ్ళమని చెప్తాడు. ఎందుకు అలా చెప్పారని కనకం అంటుంది. తన కాళ్ళ పై తను నిలబడాలని అనుకుంటుందని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత అపర్ణ ని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. స్వప్న దిష్టి తీస్తుంటే.. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. తరువాయి భాగంలో నేను లేనప్పుడు ఏం జరిగిందని అపర్ణ అనగానే.. నీ కోడలు చెయ్యాల్సిన తప్పు చేసి నిలదీసేసరికి వెళ్ళిపోయింది. నేను కారణం కాదు.. నీ కొడుకు వల్లే వెళ్లి పోయిందని రుద్రాణి అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read