Brahmamudi : ఆటో నడుపుకుంటున్న దుగ్గిరాల వారసుడు.. రాహుల్ ప్లాన్ సక్సెస్!
on Aug 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -502 లో... కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. రాహుల్ ఫ్రాడ్ చేస్తున్న విషయం చెప్తుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి ఎలాగైనా దాన్ని ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆపాలని అనుకుంటారు. మరొకవైపు జాబ్ చేస్తే.. నెలంత కష్టపడితే డబ్బుకు వస్తాయ్.. అలా అయితే మాకు రోజు ఎలా గడుస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్ ని చూసి తన దగ్గరికి వెళ్లి జాబ్ కావాలి.. ఆటో నడుపుతానని అంటాడు. సరే నీకు సేట్ నెంబర్ ఇస్తాను ఆటో అద్దెకి ఇస్తాడు.. అన్నీ పోను అయిదు వందలు మిగులుతాయని అతను చెప్పగానే అందుకు కళ్యాణ్ సరే అంటాడు.
మరొకవైపు రాహుల్ రెడీ అయి ఆఫీస్ కీ వెళ్తుంటే కావ్య, స్వప్నలు రాహుల్ ఆగమని చెప్తారు. ఈ రోజు నుండి ఈ రాహుల్ ఆఫీస్ కి వెళ్ళడానికి వీలు లేదని కావ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. నువ్వు పిల్ల జెమిందర్ లాగా ఆర్డర్ వేస్తున్నావని కావ్యపై రుద్రాణి కోప్పడుతుంది. ఇన్ని సంవత్సరాలగా కంపెనీకి ఒక మచ్చ కూడా రాకుండా కాపాడారు. ఇప్పుడు రాహుల్ వాళ్ళ కంపెనీకీ బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉందని కావ్య అనగానే.. ఏం మాట్లాడుతున్నవంటూ రుద్రాణి, రాజ్ లు కావ్యని అంటారు.ఈ రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని కంపెనీ పేరుతో కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య అని కావ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇంత ద్రోహం చేస్తావా అంటూ ఒక్కొక్కరుగా రాహుల్ పై విరుచుకుపడుతారు. అసలు నేనేం చేసానని ఇలా అంటున్నారు సాక్ష్యాలు ఉన్నాయా అని రాహుల్ అంటాడు. ఉన్నాయ్ అవి నీ చేతిలోనే ఉన్నాయంటూ రాహుల్ చేతిలో ఫైల్ స్వప్న తీసుకొని రాజ్ కి ఇస్తుంది అది చుసిన రాజ్.. ఫైల్ అంత బానే ఉంది కదా అని అంటాడు. నేను ఇందాక చదివానని స్వప్న అంటుంది. మరి ఎక్కడ ఉందని రాహుల్ అంటాడు. మా అక్కని తప్పు ద్రోవ పట్టించావా అని కావ్య అంటుంది. ఆ తర్వాత చెయ్యని తప్పు నా కొడుకు పై వేస్తున్నారంటూ అక్కా, చెల్లెళ్ళపై రుద్రాణి విరుచుకుపడుతుంది. ఏ భార్య కూడా తన భర్తపై తప్పు మోపదు.. చేసి ఉండొచ్చని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు కలిసి కావ్య, స్వప్నలదే తప్పు అనేలా మాట్లాడుతారు. కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వచ్చి.. ఎందుకిలా చేస్తున్నావ్.. కుటుంబాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు.. నీ కోసం నా కుటుంబాన్ని వదులుకోలేనని కావ్యతో రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మొదటిసారి కళ్యాణ్ ఆటో నడపడానికి వస్తాడు. అప్పుడే కావ్య, స్వప్నలు ఆటో ఎక్కడానికి వస్తుంటారు. వాళ్లని అద్దంలో నుండి చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read