Brahmamudi : కోడలి కాపురం కోసం మామకి విడాకులు పంపించిన అత్త.. కుప్పకూలిన పెద్దాయన!
on Dec 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -583 లో....స్టెల్లా తను చేసిన వంట పది నిమిషాల్లో తినకపోతే పాడవుతుందని చెప్తుంది. దాంతో రాజ్ ఏం అనలేక సైలెంట్ గా తింటుంటాడు. మరొకవైపు ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్ లకి కావ్య భోజనం వడ్డిస్తుంది. స్టెల్లా చెప్పినట్టు చేసిన వంట తింటున్న ప్రకాష్ కి కడుపు లో ఏదో తేడా కొడుతుంది. వెంటనే బాత్రూమ్ కి పరుగుపెడతాడు. ఆ తర్వాత రాహుల్ కూడా వెళ్తాడు.
ఇక రాజ్ మాత్రం ఫోన్ వచ్చిందంటూ కవర్ చేస్తూ తను కూడ బాత్రూమ్ కి వెళ్తాడు. చూసావా ఇప్పుడు భార్య విలువ తెలిసిందా అంటు రాజ్ కి చురకలు వేస్తుంది ఇందిరాదేవి. మరొకవైపు స్టెల్లాని రాహుల్ లైన్ లో పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. నేను పెద్ద పెద్ద స్టార్స్ కి మసాజ్ చేస్తాననగానే నాకు చేస్తావా అంటూ రాహుల్ అంటాడు. డబ్బులు ఇవ్వాలనగానే రాహుల్ ఇస్తాడు. రాహుల్ కి స్టెల్లా మసాజ్ చేస్తుంది. అదంతా స్వప్న చూసి నీకు మసాజ్ కావాలా అంటూ రాహుల్ ని కొడుతుంది. స్టెల్లా పైకి వెళ్తుంది. మళ్లీ భయపడి హాల్లో కి వెళ్తుంది. చూసావా రాజ్ దీన్ని తీసుకొని వచ్చి ఎలా చేస్తున్నావో అంటూ స్వప్న అంటుంది. ఆ తర్వాత ఎలాగోలా స్టెల్లా వెళ్ళిపోతుంది. అదంతా కావ్య చూస్తూనే ఉంటుంది.
అప్పుడే ఏదో కొరియర్ వస్తుంది. అందులో అపర్ణ విడాకుల పత్రాలు పంపిస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇదంతా నీ వళ్లేనని కావ్యపై రాజ్ విరుచుకుపడుతుంటే.. అసలేం జరిగిందో కనుక్కుంటానని కావ్య కోపంగా ఇంటికి వెళ్తుంది. మీరు ఏమైనా చేసుకోండి నా భార్య నాకు కావాలని సుభాష్ అంటాడు. మమ్మీని తీసుకొని వచ్చే బాధ్యత నాది అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఆస్తులు ముక్కలు చెయ్యాలని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో సీతారామయ్య కింద పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read