Biggboss Nainika : బిగ్ బాస్ నైనిక ఎవరో తెలుసా!
on Sep 16, 2024
బిగ్ బాస్ సీజన్లో మొదటి వారమే ముగ్గురు ఛీఫ్ లు ఉన్నారు. వారిలో నైనిక ఒక చీఫ్. ఈ పొట్టి పిల్ల హౌస్ లో టాస్క్ లలో ఇరగదీస్తుంది. అసలు ఎవరీమే. బిగ్ బాస్ కి ముందు నైనిక(Nainika) ఏం చేసేది ఓసారి చూసేద్దాం.
నైనిక పూర్తి పేరు నైనిక అనసురు(Nainika Anasuru). తను డ్యాన్సర్. పుట్టింది ఒడిస్సా.. తను పుట్టినప్పుడే ఆడపిల్ల అని వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడంట. అక్కడి నుండి తన కష్టాలు మొదలయ్యాయి. ఇక అక్కడి నుండి హైదరాబాద్ కి వచ్చిన నైనిక.. కష్టపడి డ్యాన్స్ నేర్చుకుందంట. ఢీ షోలో తన డ్యాన్స్ స్టెప్పులకి జడ్జెస్ ఫిధా అయ్యారంటే తను ఏ రేంజ్ లో డ్యాన్స్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. నైనికకి ఇన్ స్టాగ్రామ్(Instagram) లో 941K ఫాలోవర్స్ ఉన్నారు. ఢీ షోలో మగ డ్యాన్సర్స్ తో పోటీపడి మరీ డ్యాన్స్ చేసే నైనికకి బిగ్ బాస్(Biggboss) ఆఫర్ లభించింది. డ్యాన్స్ తో పాటుగా సినిమాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించందంట ఈ బ్యూటీ.. అయితే అక్కడ దర్శక, నిర్మాతలు తనని కమిట్ మెంట్ అడిగారని , అది తనకి ఇష్టం లేదని చెప్తూ డ్యాన్స్, రీల్స్, షార్ట్ ఫిల్మ్ , వెబ్ సిరీస్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.
నైనిక చేసిన 'నయనం' వెబ్ సిరీస్ కి యూట్యూబ్ లో అత్యధిక వీక్షకాధరణ లభించింది. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ లో ఏ రీల్ చేసిన వైరల్ అవుతుంది. ఎందుకంటే గ్లామర్ ట్రీట్ అందించడంలో ఈ భామ తక్కువేం కాదు. బిగ్ బాస్ కి వెళ్ళేముందు యాంకర్ శివతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని కొన్నింటిని షేర్ చేసుకుంది నైనిక. అవి కూడా తను వైరల్ అయ్యేలా చేశాయి. బిగ్ వాస్ హౌస్ లో నైనిక ప్రస్తుతం చీఫ్ గా లేదు. కానీ తన ఆటతీరు, మాటతీరుతో అభిమానులని సొంతం చేసుకుంటుంది ఈ భామ.
Also Read