'జై బాలయ్యా' పాటకు రెచ్చిపోయిన కంటెస్టెంట్స్!
on Sep 17, 2022

పన్నెండో రోజు బిగ్ బాస్ హౌస్ చాలా సందడిగా జరిగింది. డీజే పాటలకు కంటెస్టెంట్స్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి. "జై బాలయ్యా" పాట రాగానే కంటెస్టెంట్స్ అందరూ రెచ్చిపోయి డ్యాన్స్ చేసారు. పాట ముగిసాక "జై బాలయ్య జైజై బాలయ్య" అంటూ కాసేపు మంచి జోష్ మీదున్నట్టుగా అనిపించారు.
"రెండో వారం ఎవరు కెప్టెన్ గా ఉండాలో నిర్ణయించాలి కాబట్టి ఓటింగ్ ప్రక్రియను ప్రతీ డీజే పాట పూర్తి అయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చి మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో తమ ఓట్ ఎవరికో చెప్పాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ చెప్పాడు.
ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి నాలుగు ఓట్లతో రాజ్ గెలిచాడు. "రాజ్.. మీరు ఇంటి కెప్టెన్ అయినందున మిమ్మల్ని అభినందిస్తున్నారు బిగ్ బాస్. ఫినోలెక్స్ పైప్స్ సింహాసనం మీద కూర్చొని బాధ్యతలు స్వీకరించు" అని బిగ్ బాస్ చెప్పాడు. హౌస్ మేట్స్ అందరూ 'రాజ్ రాజ్ ' అంటూ అరుస్తూ అభినందనలు తెలిపారు.
ఆ తర్వాత ఇనయా బెడ్రూం కి వెళ్ళి ఏడ్చింది. తను ఏడ్వడం చూసి చంటి, వాసంతి వచ్చి ఓదార్చారు. తర్వాత "ఇక్కడ ఎవరూ అమాయకులు కాదు. నీ గేమ్ నాకు అర్థమవుతోంది. ఎవరి గేమ్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు. నేను జాగ్రత్తగా ఉంటాను" అని గీతూతో అన్నాడు ఆదిరెడ్డి.
గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా,ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



