గడ్డం తీసేస్తే మూడు వారాలు సేఫ్.. ఆఫర్ రిజెక్ట్ చేసిన పృథ్వీ!
on Oct 20, 2024
బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం ఫుల్ ఛార్జ్ తో కంటెస్టెంట్స్ టాస్క్ ఆడారు. అయితే ఆ గేమ్ తో పాటు హెయిర్ కట్ ఛాలెంజ్ చేసుకోవాలంటూ పృథ్వీ, అవినాష్ లని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకున్నాడు.
ఈ టాస్క్ లో పృథ్వీ హెయిర్ కట్ ఛాలెంజ్ కి ఒప్పుకోలేదు.. అవినాష్ ఒప్పుకొని హెయిర్ కట్ చేయించుకున్నాడు.. అదే విషయం నాగార్జున స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అడిగాడు. నాకు ఇష్టం లేదు సర్ అని పృథ్వీ అంటాడు. ఇష్టం లేదా.. ఎవరైనా వద్దని చెప్పారా.. విష్ణుప్రియ నువ్వు ఏమైనా చెప్పావా అని నాగార్జున అడుగుతాడు. లేదు సర్ అని విష్ణుప్రియ అంటుంది.
అవినాష్ చూడు ఎంత అందంగా ఉన్నాడోనని నాగార్జున అనగానే.. అంత అందం నాకు వద్దని పృథ్వీ అంటాడు. ఒక ఆఫర్ ఇస్తున్నాను.. నువ్వు ఓన్లీ గడ్డం తీసేస్తే ప్రైజ్ మనీకి నాలుగు లక్షలు ఆడ్ అవుతాయని నాగార్జున చెప్పగా.. పృథ్వీ నో అని అంటాడు. అయితే ఎనినిది లక్షలు అని నాగార్జున అంటాడు. దానికి పృథ్వి నో చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మరొక ఆఫర్ ఆలోచించుకో.. టూ వీక్స్ నామినేషన్ నుండి సేవ్ అవుతావని నాగార్జున అంటాడు. అయిన పృథ్వీ దానికి నో అంటాడు. నిఖిల్ నువ్వు చెప్పు పృథ్వీతో డిస్కషన్ చెయ్.. తనకి చెప్పు.. ఇప్పుడు ఏడో వారం కదా.. డైరెక్ట్ పదో వారం వరకు నో నామినేషన్ పృథ్వీకి అని నాగార్జున అనగానే.. వాడు ఒప్పుకోడు సర్.. నాకు ఇవ్వండి ఇప్పుడే వెళ్లి షేవ్ చేసుకొని వస్తానని నిఖిల్ అంటాడు. అది నీకు కాదు ఓన్లీ పృథ్వీకి అని నాగార్జున అంటాడు. దానికి కూడా పృథ్వీ నో చెప్తాడు. ఈ లెక్కన హౌస్ లో ఉండడం కంటే కూడా తన గడ్డానికే పృథ్వీ ఎక్కువ విలువ ఇస్తాడన్నమాట.
బిబి టైమ్స్ హెడ్ లైన్స్ లో భాగంగా.. కింగ్ అఫ్ డిస్ రెస్పెక్ట్ వాంట్స్ ఆల్వేస్ రెస్పెక్ట్.. ఆట కంటే నేనే ముఖ్యం.. అనే రెండు హెడ్ లైన్స్ ని పృథ్వీకి నాగార్జున ఇవ్వగా.. హౌస్ మేట్స్ అందరు ఒకే అంటారు. ఇచ్చిన టూ హెడ్ లైన్స్ లో మొదటిది అవినాష్ ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు.. పృథ్వి పై విరుచుకుపడతాడు నాగార్జున. 'ఒరేయ్ పృథ్వీ' అంటే ఎలా ఉంది బాలేదు కదా అని నాగార్జున అంటాడు. అలా అనకు అని నాగార్జున చెప్తాడు. సెకెండ్ హెడ్ లైన్ లో టాస్క్ లో హెయిర్ కట్ చేసుకోకుండా తన కోసం మాత్రమే చూసుకున్నాడు. అందుకే టూ హెడ్ లైన్స్ పృథ్వీకి ఇచ్చాడు నాగార్జున.
Also Read