నిఖిల్ : మన దగ్గరకు రావాలని రాసి పెట్టి ఉంటే కచ్చితంగా వస్తుంది
on Jan 7, 2025
బిగ్ బాస్ సీజన్ 8 ఐపోయాక విన్నర్ నిఖిల్ బాగా ఆడిన పృద్వి బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ అలాగే ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు నిఖిల్. " బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను చేయలేనేమో అనుకున్నా..కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నేను ఏదైనా చేయగలను అనుకున్నా. బిగ్ బాస్ కి ప్రజల ప్రేమ పొందడానికి వెళ్లాను. చిన్నపిల్లలు కూడా నన్ను ప్రేమించడం చూస్తున్నా. అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అదృష్టం. నా ఒపీనియన్ లో లవ్ అంటే యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటే బెటర్. సోనియాకి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పుష్ప మూవీ చూసా.
ఐతే నాకు బిగ్ బాస్ నుంచి ఇంకా రెమ్యూనరేషన్ రాలేదు. వచ్చాక ఒక్కరికి ఛారిటీ ఇద్దామనుకుంటున్న ఆ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పను.. అలాగే అమ్మ నాన్న కోసం ఒక ఇల్లు కొని ఇద్దామనుకుంటున్నా. ఇప్పటి వరకు కొన్ని యూట్యూబ్ చానెల్స్ మా పేర్లతో మా ఫొటోస్ తో ఇంటర్వ్యూస్ చేసింది చాలు..ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ థంబ్ నెయిల్స్ , ఫొటోస్ పెట్టుకోండి. మా పేర్లు, మా ముఖాలు వాడుకున్నది చాలు..ఇంతవరకు బతికేసారు చాలు గాని..ఇక కట్ చేసుకోండి..మీ టాలెంట్ చూపించుకోండి. నేను చేసే మటన్, సాంబార్ హౌస్ లో చాలామందికి ఇష్టం. త్వరలో ఒక సీరియల్ , ఒక వెబ్ సిరీస్, ఒక మూవీ చేసే అవకాశం ఉంది. చూసుకుని నెమ్మదిగా చేద్దామనుకుంటున్నా. పెళ్లి ప్రొపోజల్స్ వస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ట్రై చేస్తాం కానీ ప్రతీసారీ మనమే వెనక వెళ్లడం తప్పు. మన దగ్గరకు రావాలని రాసి పెట్టి ఉంటె కచ్చితంగా వస్తుంది. అంతేకాని మనం ఎంత ట్రై చేసినా రాదు" అని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.
Also Read