శివాజీ చెప్పిన టాప్-5 ఎవరంటే.. నబీల్ ఏ స్థానంలో ఉన్నాడంటే!
on Nov 17, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో పదకొండో వారం వీకెండ్ ఎపిసోడ్ సూపర్ గా సాగింది. కారణమేమంటే హౌస్ లో వారమంతా ఫ్యామిలీ వీక్ అవ్వగా.. వీకెండ్ లో ఒక ఫ్యామిలీ పర్సన్ మరో సెలెబ్రిటీ వచ్చారు. ఇక హౌస్ లో ఉన్న పదిమంది కంటెస్టెంట్స్ లలో టాప్-5 ఎవరో చెప్తూ వచ్చినవాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారు.
మొదటగా ప్రేరణ ఫ్యామిలీ రాగా, ఆ తర్వాత విష్ణుప్రియ కోసం తన చెల్లి ఇంకా యాంకర్ రవి స్టేజ్ మీదకి వచ్చారు. ఇక ఆ తర్వాత రోహిణి కోసం తన తండ్రి మరియు శివాజీ ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చీ రాగానే శివాజీ కంటెస్టెంట్స్ కి టిప్స్ ఇచ్చాడు. మీరు హౌస్ లో ఎంత ఫెయిర్ గా ఉంటారో అదే అల్టిమేట్ విన్నర్ ని చేస్తుందంటూ గొప్పగా చెప్పాడు . నీతిగా ఆడాలి.. నిజాయతీగా ఆడాలి.. విన్నర్ అయినా కాకపోయిన హృదయాలు గెలవాలంటూ శివాజీ చెప్పాడు. ఆ తర్వాత రోహిణి కొంచెం గ్లామర్‌గా తయారైంది.. మా గౌతమ్ గాడి గురించేనా.. రేయ్ గౌతమ్ నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుద్దిరా.. ఎంత ట్రై చేస్తుందిరా.. అంతకంటే అందం దొరుకుతుందా..యష్మీని ట్రై చేశావ్ ఏమైంది.. బిజీగా ఉంది.. కాబట్టి పట్టించుకోలేదు.. వర్కవుట్ అవ్వట్లేదని చివరికి అక్కా అన్నావ్.. అంటు శివాజీ కామెడీగా అన్నాడు.
ఇక గౌతమ్ మాట్లాడుతూ సీజన్ -7 అయిన తర్వాత శివాజీ అన్నని చాలా సార్లు కలిశా.. చాలా క్లోజ్ అయ్యామంటూ చెప్పాడు. ఇక శివాజీ తన దృష్టిలో టాప్-5 ఎవరో చెబుతూ విష్ణప్రియకి మొదటి స్థానం ఇచ్చాడు. ఇది చూసి నాగార్జునతో పాటు విష్ణు కూడా అవాక్కైంది. మొదటి స్థానం విష్ణుప్రియకి ఇవ్వగా, నబీల్ కి సెకెండ్ ప్లేస్ ఇచ్చాడు. ఇక మూడు నిఖిల్, నాలుగు గౌతమ్, ఐదవ స్థానంలో రోహిణి పేరుని పెట్టాడు శివాజీ.
Also Read