నన్ను ట్రోలింగ్ చేయడం వల్లనే నా కెరీర్ నాశనమయ్యింది..
on Jan 7, 2025
సయ్యద్ సోహైల్ రీసెంట్ గా కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు అక్కడ ఫుడ్ తినడానికి వెళ్లే వాళ్లంతా కూడా సోహైల్ చూసే అవకాశం వస్తోంది. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ఒక పాయింట్ గురించి చెప్పుకొచ్చాడు. "నేను సినిమాలు చేస్తున్నానని బయటకు రాకూడదు అంటే అది జరగని పని. కంటెంట్ ఉంటే టికెట్స్ తెగుతాయి. నేనేమీ రోడ్డు మీద తిరగడం లేదు. నా రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నా. నా కోసం నేను చేసిన మూవీ కోసం సినిమా థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం నేను రెస్టారెంట్ దగ్గర రిసీవ్ చేసుకోవడం తప్పేం లేదు కదా.
సెలెబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలా..అమ్మ మా ఎదుగుదల చూడాలనుకుంది కానీ ఆమె బతికి ఉండగా మేము సెటిల్ కాలేదు. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టా..అమ్మతో కూర్చుని తినాలని అనుకున్నా..ఇప్పుడు అవకాశం లేదు. పెద్దవాళ్ళు బతికి ఉన్నప్పుడు వాళ్ళ వేల్యూ తెలీదు. అమ్మకు డయాలసిస్ చేస్తున్నారు నేను తమ్ముడు కూడా కిడ్నీ ఇద్దామని అనుకున్నాం..కానీ సడెన్ గా ఫిట్స్ వచ్చేసాయి. దాంతో బ్రెయిన్ డామేజ్ అయ్యింది. అలా ఆమె దూరమైపోయింది. నేను నా సినిమా చూడండి అని చెప్పిన డైలాగ్స్ చాలా ట్రోలింగ్ కి గురయ్యాయి అప్పట్లో మా అమ్మ అవి చూసి బాధపడింది. ఇలాంటి ట్రోలింగ్స్ వస్తే చిన్న హీరోల కెరీర్ స్టాప్ ఐపోతుంది. అదే ఒక చిన్న బాబుకు హెల్త్ ఇష్యూ వస్తే నాతో సహా ఇంకొంతమందిమి కలిసి నాలుగు లక్షలు ఇచ్చాము ట్రీట్మెంట్ కి. కానీ అదెందుకు ట్రోలింగ్ చేయరు. ఈరోజున మంచి చేస్తే గడప బయటకు కూడా వెళ్ళదు. కానీ చెడు మాత్రం ఆ మనిషిని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తుంది. " అంటూ ఆవేదనగా చెప్పాడు సోహైల్.
Also Read