సోనియా ఆకుల కోసమే మొదటి భార్యకు విడాకులు..
on Dec 26, 2024
నిన్న మొన్నటి వరకు ఆకుల సోనియా అంటే పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 తో ఆమె ఫుల్ ఫేమస్ ఐపోయింది. అలాగే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ ఐపోగానే తాను ప్రేమించిన యష్ ని పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి చేసుకున్న సాయంత్రానికే ఇష్మార్ట్ జోడి 3 లోకి వచ్చేసారు. హైదరాబాద్ వేదికగా జరిగిన సోనియా వివాహానికి పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోనియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఐతే రీసెంట్ గా సోనియా గురించి ఒక విషయం బాగా మీడియాలో ట్రోల్ అవుతోంది. "సోనియా కోసమే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు యష్ అని" ఐతే ఈ విషయం మీద ఈ భార్యా భర్తలు ఇద్దరూ కూడా స్పందించారు. " ఐతే నేను ఈ విడాకుల విషయం గురించి ఏమీ మాట్లాడను.. కానీ అది నిజం కాదు. మా పర్సనల్ డిస్టర్బెన్సెస్ కారణంగా మేము విడాకులు తీసుకున్నాం..ఆ తర్వాతే సోనియా నా లైఫ్ లోకి వచ్చింది. నా బిడ్డ విరాట్ ని నా ఫామిలీ మెంబర్స్ ని బాగా చూసుకుంటుంది. ఇక మేము ఇద్దరం కూడా ఆ అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తాం. ఆమెకు కూడా మంచి లైఫ్ ఉండాలి అనుకుంటున్నాం. నా గురించి యష్ వాళ్ళ ఫామిలీ మొత్తానికి కూడా బాగా తెలుసు. నేను ఎవరితో ఎలా ఉంటాను. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తానో కూడా బాగా తెలుసు. ఇక యష్ వాళ్ళ మేనత్తకి ఐతే నేను పవన్ కళ్యాణ్ లెక్కా. అంత ఇష్టం." అని చెప్పారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ అందించిన కరోనా వైరస్ మూవీలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూతురు శాంతి పాత్రలో సోనియా ఆకుల నటించింది. అలాగే ఆశ, ఎన్ కౌంటర్ మూవీస్ లో నటించింది. బాధితురాలు ఆశ పాత్రలో సోనియా మెప్పించింది.
Also Read