నిన్ను చెప్పుతో కొట్టాలి.. నీలాంటోళ్ళు బతికుండకూడదంటు బూతులు తిట్టారు
on Feb 13, 2026

బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కనెక్షన్ రౌండ్ కాన్సెప్ట్ లో అందరూ రకరకాల పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఫైనల్ గా సీత - సాయి శ్రీనివాస్ కలిసి చేశారు. ఐతే సీతను హోస్ట్ ప్రదీప్ ఒక విషయం అడిగాడు. బేబీ మూవీలో హీరోయిన్ ని "ఒకళ్ళిద్దరు ఆనందం కోసం తయారు చేసే ఒక న్యూస్ దాని వెనకాల కొంతమంది లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. బేబీ సినిమా టైంలో నేను గమనించాను. హీరోయిన్ ని బాడ్ డైరెక్షన్ లో మోటివేట్ చేసింది అనే ఒక క్యారెక్టర్ ని ప్లే చేసింది హీరోయిన్ ఫ్రెండ్ గా. దాని తర్వాత ఈమె ఎదుర్కున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈమె నిజంగా అలానే ఉంటుంది. అసలు ఎం జరిగింది" అంటూ సీతను అడిగాడు. "నేను మా అమ్మను తీసుకుని ఒక ఈవెంట్ కి వెళ్లాను.
దాని తర్వాత మేము రిటర్న్ అయ్యాను. ఒకరు మమ్మల్ని ఫాలో అయ్యారు. ఏంటా అని డోర్ తీసా. హిందీలో బూతులు తిట్టాడు. డెత్ థ్రెట్స్ ఐతే చాలా వచ్చాయి. నిన్ను చెప్పుతో కొట్టాలి నీలాంటోళ్ళు బతికుండకూడదు అన్నారు. సినిమాను అంత పర్సనల్ గా తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు." అని చెప్పింది. ఇక సీత - సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ విషయంలో పెద్ద గలాటా జరిగింది. "ఈ కాన్సెప్ట్ కి బాగా చేయొచ్చు" అంటూ డెమోన్ పవన్ అనేసరికి "ఎలా చేయాలో చెప్పండి" అంది సీత. "మేమే చెప్పేవాళ్ళమే ఐతే మేమే కొరియోగ్రాఫర్స్ గా అక్కడ ఉండేవాళ్ళం" అంది రీతూ. "నాలుగు నిమిషాల్లో ఇవన్నీ చేయొచ్చా" అంది సీత. "చేయొచ్చు" అని పవన్ అనేసరికి "నెక్స్ట్ టైం మీరే చేసేటప్పుడు చూస్తా" అంది సీత. "కాన్సెప్ట్ ప్లస్ డాన్స్ ఉండాలి కదా" అని రీతూ అనేసరికి "అందులో డాన్స్ లేదు" అంది సీత." డాన్స్ లేదు అనలేదు కనబడలేదు" అంది రీతూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



