ఎంబిబిఎస్ చేసిన శ్రీలీల.. ఏదేమైనా బాలయ్యతో కిస్సిక్ స్టెప్పులేయించింది
on Dec 4, 2024
ఈమధ్య ఎక్కడ చూసినా శ్రీలీల జపం తప్ప వేరే ఎవరూ కనిపించడం లేదు, వినిపించడం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కూడా శ్రీలీల, శ్రీలీల అని పాట పాడుతున్నారు. ఎంబిబిఎస్ చేసిందంటూ నవీన్ పోలిశెట్టి అన్స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ కి ఎవ్వరికైనా నిజంగా రాకుండా ఉండదు. దాన్ని ఎక్స్ప్లైన్ చేసాడు కూడా. ఎంబిబిఎస్ లో మూడు మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి, సెకండ్ ఇయర్ లో ధమాకా మూవీ నుంచి జింతాక, థర్డ్ ఇయర్ లో పుష్ప 2 నుంచి కిస్సిక్ సాంగ్.
అంతే శ్రీలీల ఎంబిబిఎస్ చేసేసింది అని చెప్పాడు. ఇక హోస్ట్ బాలయ్య నెక్స్ట్ డాక్టర్ శ్రీలీల అంటూ అనౌన్స్ చేసేసారు. శ్రీలీలతో డాన్స్ అంత వీజీ కాదు అన్న రేంజ్ లో చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఈ షో ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. డేట్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ యాక్టర్ ని తీసుకెళ్తావ్ అని అడిగేసరికి నవీన్ పోలిశెట్టి ఇక మేము డేట్ కి వెళ్తున్నామంటూ బాలయ్యను తీసుకెళ్లాడు. బాలయ్య కూడా నవీన్ బుగ్గ మీద ముద్దిచ్చాడు. ఇక ప్రోమో ఫైనల్ లో మాత్రం శ్రీలీల కిస్సిక్ సాంగ్ కి హోస్ట్ బాలయ్యతో స్టెప్పులేయించింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే "నవీన్ కి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఉంది. ఎంబిబిఎస్ అంటూ భలే చెప్పాడు. చాలా రోజుల తర్వాత నవీన్ పోలిశెట్టిని చూస్తున్నాం. నవీన్, శ్రీలీల పెయిర్ బాగుంది. బాలయ్య డాన్స్ బాగుంది. బాలయ్య యాంకరింగ్ స్టైల్ సూపర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read