Avinash in Finale : ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్ అవినాష్..
on Nov 30, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ లో టేస్టీ తేజ వాళ్ళ అమ్మ రావడం కోసం యావత్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు అవినాష్ గెలవాలని అందరు ఎదురుచూశారు. అదేవిధంగా తను నామినేషన్ లో నుండి సేవ్ అవ్వాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు.
బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.. ఆటల్లో , పాటల్లో, కామెడీ చేయడంలో ఎందులోను తగ్గడం లేదు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తమ బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. ఏ గేమ్ పెట్టినా గెలిచే వస్తున్నారు. తమ వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ కసిగా గేమ్ ఆడుతున్నారు. దేనిలో తగ్గడంలేదు. ఎక్కడ రాజీ పడటం లేదు.. ప్రతీ గేమ్ లో కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ ఆడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా టికెట్ టు ఫినాలేకి నాల్గవ కంటెస్టెంట్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అదేంటంటే.. ఇప్పటికే సెలెక్ట్ అయిన నిఖిల్, అవినాష్, రోహిణిలని .. గౌతమ్, పృథ్వీ, తేజలలో నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు బిగ్ బాస్. దాంతో ముగ్గరు కలిసి ఏకాభిప్రాయంతో తేజని సెలెక్ట్ చేసుకున్నారు.
తేజ, అవినాష్, రోహిణి, నలుగురు కలిసి టికెట్ టు ఫినాలేలో మొదటి టాస్క్ ఆడారు. గంట పట్టు ఫోటో కనిపెట్టు టాస్క్ లో భాగంగా డిస్ ప్లేలో చూపించిన ఫోటోని చూసి అది హౌస్ లో ఏదో చెప్పాలి. ఇందులో తేజ ఒక్క పాయింటే గెలిచి నాల్లో స్థానంంలో ఉండి. టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక నిఖిల్, రోహిణి, అవినాష్ చివరి గేమ్ ఆడారు. ' బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ ' అనే అక్షరాలని యాక్టివిటి ఏరియాలో ఒక టేబుల్ పై అమర్చి ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో స్టాండ్ మీద ఉన్న ఫైనలిస్ట్ అనే పేరు ఉన్న క్యూబిక్స్ ని బాల్స్ సహాయంతో పడేయాలి. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి అటు ఇటు ఊగే స్టాండ్ మీద పెట్టి తాడు సహాయంతో బ్యాలెన్స్ చేయాలి. అలా చేసిన వారే టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఇందులో మొదటగా నిఖిల్ యాక్టివిటి ఏరియాలో సరైన క్రమంలో పెట్టేసి గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడ క్యూబ్స్ ని పడేసి ఫైనల్ స్టాండ్ దగ్గరికి వచ్చాడు. సెకెంఢ్ అవినాష్ వచ్చాడు. కానీ ఊగే స్టాండ్ మీద క్యూబ్స్ ని పెట్టి తాడుతో బ్యాలెన్స్ చేయడంలో అవినాష్ గెలుపొందాడు. నిఖిల్ ఓడిపోయాడు. ఇదిదా సరైన గేమ్ అంటే అంటు నిరూపించాడు అవినాష్. హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉంటే అందులో ఆరుగురు నిఖిల్ కి సపోర్ట్ చేయగా ఒక్క తేజ మాత్రమే అవినాష్ కి సపోర్ట్ ఇచ్చాడు. అయినా సరే అవినాష్ బెస్ట్ ఇచ్చాడు.. గెలిచాడు. కెజిఎఫ్ సినిమాలోని రణరణ ధీర అంటూ సాంగ్ వేసేసరికి అవినాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక శ్రీముఖి చేతుల మీదుగా టికెట్ ను అందుకున్నాడు అవినాష్. ఇక ఆ టికెట్ ని తన భార్య అను ఫోటోకి చూపిస్తూ మురిసిపోయాడు అవినాష్. లవ్ యూ అనూ..ఇది నీకే అనూ అంటు తన ఫొటో దగ్గరే పెట్టాడు అవినాష్. ఇది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్ అంటూ అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read