ఛ..నన్నెవరూ కమిట్మెంట్ అడగలేదు.. ఒకవేళ అడిగితే ఎలా ఉంటుందో ?
on Apr 5, 2025
బుల్లితెర మీద జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అష్షురెడ్డి. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. "కమిట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో నాకు ఇంత వరకు తెలీదు. కానీ అడిగితే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే దురద కూడా నాకు ఉండేది. ఐతే ఇప్పటి వరకు నాకు అలాంటి సందర్భం ఎదురు కాలేదు..బహుశా నేను అంతలా ఎదగలేదేమో అడగడానికి. ఇప్పుడు చాలామంది వచ్చామా, పని చేసుకున్నామా , వెళ్ళిపోయి పడుకున్నామా అనేవాళ్లే ఉన్నారు. నా మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినా నేను పట్టించుకోను. అరుణాచల శివుడి దగ్గరకు వెళ్లాం నేను నా ఫ్రెండ్ కలిసి...అక్కడి నుంచి వచ్చాక నేను చాలా మారాను. శివుడు ఉన్నాడు చూసుకుంటాడు అనిపిస్తుంది.
అరుణాచలం ఒక పవర్ ఫుల్ ప్లేస్. అరుణాచలం వెళ్లక ముందు ఒక రకమైన ఆలోచన ఉండేది. అరుణాచలం వెళ్లి వచ్చాక చాల శాంతంగా ఉంది. ఐనా ఎందుకు నేను అంతలా రియాక్ట్ కావాలి ఏ విషయానికైనా అనుకుంటున్నాను. నాలోనే చాలా మార్పు వచ్చింది. ఇక లివింగ్ రిలేషిప్ అనేది జీవితంలో ఒక చెడ్డ విషయం.. పెళ్లి మాత్రమే స్పెషల్ లైఫ్ లో. కోపాలు, తాపాలు, చిన్న చిన్న రొమాన్స్ లు ఇవన్నీ ముందే చేసేస్తే పెళ్లి తర్వాత టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తారు. పెళ్లి తర్వాత ఇలాంటి మాజికల్ థింగ్స్ జరిగితేనే అందంగా ఉంటుంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవాళ్లకు కొంచెం లేట్ ఐనా కానీ సక్సెస్ మాత్రం వస్తుంది. ఐతే ఏమీ లేనప్పుడు ఎలా ఐతే నీ మైండ్ సెట్ ఉంటుందో...అన్ని ఉన్నప్పుడు కూడా మైండ్ సెట్ అలాగే ఉండాలి" అంటూ చెప్పుకొచ్చింది అష్షు రెడ్డి. ఇక ఇదే కమిట్మెంట్ మీద వర్ష కూడా మాట్లాడింది. " ఛ అసలు ఎవరూ నన్ను కమిట్మెంట్ అడగలేదు. బేసిక్ గ వర్క్ ఐపోయిన తర్వాత మాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ లు చేయరు.." అంటూ తెగ ఫీలైపోయింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
