అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!
on Apr 21, 2025

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. టీవీ షోలు, సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన వీడియో కంటతడి పెట్టించేలా ఉంది. (Ashu Reddy)
కొద్ది నెలల క్రితం అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆ మధ్య ఒక షోలో స్వయంగా ఆమెనే చెప్పింది. ఆ సమయంలో తన కెరీర్ క్లోజ్ అయింది అనుకున్నానని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. అయితే ఈ సర్జరీ గురించి తర్వాత అషు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అషు రెడ్డి జుట్టు తొలగించి సర్జరీ చేయడం, ఆ సమయంలో ఆమె బాగా ఎమోషనల్ అవ్వడం, అలాంటి సిచువేషన్ నుంచి అషు కమ్ బ్యాక్ ఇవ్వడం చూడవచ్చు. ఈ వీడియో ఎంతో ఎమోషనల్ గా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



