Brahmamudi:చోటూ, మోటూలని ఆటాడుకున్న రాజ్, కావ్య.. పెన్ డ్రైవ్ దొరికేనా!
on Dec 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -900 లో.....రాజ్, కావ్య కావాలనే పెన్ డ్రైవ్ శృతికి ఇచ్చామని మాట్లాడుకుంటారు. అది విని చోటూ, మోటూ ఇద్దరు శృతి కోసం వెతకడానికి వెళ్తారు. సంగీత కచేరి చేసేవాళ్లు శృతి గురించి మాట్లాడుకుంటే వెళ్లి శృతి ఎక్కడ అని అడుగుతారు. ఇదిగో పాడుతున్నారుగా అని వాళ్ళు అంటారు. మరొకవైపు అప్పు తన ఆఫీసర్ చెప్పింది గుర్తుచేసుకొని కోపంగా ఫైల్ విసిరేస్తుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు.
మా సర్ పాప కేసు వదిలేసి కొత్త కేసు చూడమని చెప్పాడు.. ఇక కేసుని వదిలేస్తున్నానని అప్పు అనగానే ఎందుకు అలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటావ్.. నువ్వు అనుకున్నది చెయ్ అని ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడే రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసిందని తన పక్కింటి వాళ్ళు అప్పుకి ఫోన్ చేసి చెప్తారు. మరొకవైపు వాళ్ళ రూమ్ కి వెళ్లి పెన్ డ్రైవ్ తీసుకొని అది మన బాస్ కి గిఫ్ట్ ఇద్దామని చోటు మోటు మాట్లాడుకుంటుంటే కావ్య,రాజ్ వింటారు. మరొకవైపు రేణుక దగ్గరికి అప్పు వస్తుంది. ఎందుకు ఇలా చేసారని అప్పు అనగానే.. నా కూతురు ఉందంటే ఎవరూ నమ్మడం లేదని తను చెప్తుంది. అప్పు బయటకు వచ్చి కానిస్టేబుల్ తో మాట్లాడుతుంది. మూడు రోజులవుతుంది అసలు కేసు గురించి తెలియడం లేదని డిస్సాపాయింట్ అవుతుంటే.. అప్పుడే పాప ఫ్రెండ్ అప్పు దగ్గరికి వచ్చి.. ఆంటీ మా ఫ్రెండ్ ఇందాక ఇంటిముందు కన్పించింది. ఆ విషయం చెప్తే మా అమ్మవాళ్ళు మనకెందుకు పోలీసులు మనల్ని అడుగుతారని చెప్పారంటూ ఆ పాప చెప్పగానే థాంక్స్ అమ్మ మంచి క్లూ ఇచ్చావని అప్పు అంటుంది.
మరొకవైపు చోటూ, మోటూ ఇద్దరు రాజ్, కావ్య గదిలోకి వస్తారు. వాళ్ళిద్దరిని రాజ్, కావ్య ఒక ఆట ఆడుకుంటారు. ఆ తర్వాత రాహుల్ వర్క్ చేసుకుంటుంటే అప్పుడే స్వప్న వచ్చి డోర్ వేస్తుంది. ఓహ్ నేను బాధ్యతగా ఉంటున్నానని స్వప్న కూడా భార్యగా ఉండాలని అనుకుంటుందేమోనని రాహుల్ అనుకుంటాడు. ఏంటి స్వప్న ఇంత అందంగా ఉన్నావని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



