కాఫీలు, టీలు తాగకపోయినంత మాత్రాన ఏమీ కాదు
on Dec 12, 2024
చాలామందికి ఉదయాన్నే లేచాక ఖాళి కడుపుతో కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే డాక్టర్స్ కానీ ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు కానీ ఒక్కటే చెప్తారు ఖాళీ కడుపుతో ఇలాంటివి తాగకూడదు అలాగే ఆయిల్ ఫుడ్ తినకూడదు అలా చేస్తే జీర్ణవ్యవస్థ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని. ఐతే ఇప్పుడు బుల్లితెర నటి అనిత చౌదరి కూడా అదే చెప్తోంది. ఉదయాన్నే లేచి ఇవి తాగడం వలన మలబద్దకం వస్తుంది, జీర్ణ వ్యవస్థ లైనింగ్ పాడైపోతుంది. దాంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అలా కాకుండా ఉదయాన్నే లేచాక ఒక గ్లాసుడు నీళ్లు తాగి ఏదైనా స్నాక్ అంటే ఒక బిస్కెట్ కానీ అలా ఏదైనా తినేసి కాఫీ ఆర్ టీ కానీ తాగితే చాలా బెటర్ గా ఉంటుంది అని చెప్పింది.
అది కూడా లిమిట్ గానే తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే పేగుల మీదా బాగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తాను చెప్పినట్టు చేస్తే కొంత మంచిగా ఉంటుంది అని అనిత చౌదరి తాని ఫాలో అయ్యే టిప్ ని చెప్పింది. వెల్నెస్ జర్నీ పేరుతో ఆమె హెల్త్ కి సంబందించిన ఎన్నో టిప్స్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తోంది. ఇక నెటిజన్స్ కూడా మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాం మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నైట్ అంతా ఖాళీగా ఉంటుంది అంటే ఎండిపోయి ఉంటుంది. ఉదాహరణకు బాగా మిట్టమధ్యాహ్నం వేళా ఎండ మండేటప్పుడు చెప్పుల్లేకుండా బయటకు వెళ్తే కాళ్ళు సర్రున అంటుకుని నొప్పి పెడతాయి..కొందరికి బొబ్బలొస్తాయి కూడా..అదే ఆ వేడి నేల మీద ఒక చెంబుడు నీళ్లు పోసాక నడిస్తే ఆ ఎండ ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఇది కూడా అంతే కాలే కడుపులో ఇంకా కాలిపోయే కాఫీలు టీలు తాగితే సుతిమెత్తగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అదే ఉదయాన్ని ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీళ్లు కానీ నార్మల్ వాటర్ కానీ లేదా మజ్జిగా కానీ తాగితే ఆ ఎఫెక్ట్ పెద్దగా అనిపించదు లాంగ్ రన్ లో రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
Also Read