మొదట్లో నాకు అవకాశాలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెట్టేవారు
on Dec 23, 2022
.webp)
ఆసియా, నూకరాజు తమది రీల్ లవ్ కాదు అని రియల్ లవ్ అని బుల్లితెర ఆడియన్స్ కి చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు ఆసియా - నూకరాజు ఒక ఇంటర్వ్యూలో కనిపించి తమ లైఫ్ లో పడిన కష్టాల గురించి ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఆసియా తన జర్నీ గురించి చెబుతూ " బిటెక్ చదివేటప్పుడు పటాస్ ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేసేసరికి అందులో మంచి అవకాశం వచ్చింది అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. అప్పుడే నూకరాజు పరిచయం అయ్యాడు. మా అమ్మా నాన్న కూలీ పని చేసి మమ్మల్ని పెంచారు.
ఐతే మా పేరెంట్స్ కి ఇదంతా ఇష్టం లేదు. కానీ నేను నా చదువును, నటనను బాలన్స్ చేసుకుంటూ వచ్చాను. మొదట్లో అవకాశాలు బాగా ఇచ్చారు కానీ నూకరాజుతో ప్రేమ గురించి తెలిసాక అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఎందుకో అర్ధమయ్యేది కాదు. అలా రెండేళ్లు ఖాళీగా ఉన్నాను. అప్పుడు నాకు నూకరాజే డబ్బు సాయం చేసేవాడు. తర్వాత నూకరాజు తాను చేసే కామెడీ షోస్ లో నాకూ క్యారెక్టర్ ఇమ్మని అడిగేవాడు. అలా అడిగి అడిగి ఇప్పటికి నేను కొంచెం ఫేమస్ అయ్యాను. ఐతే అవకాశాలు ఇవ్వకుండా నన్ను బాధపెట్టినప్పుడు నూకరాజు నా చేత యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయించాడు.
ఇక ఇప్పుడు నేను చాలా బాగున్నాను. షోస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి" అని చెప్పింది ఆసియా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



