సుమక్కా! నువ్వులేని ఆ ప్రిరిలీజ్ ఈవెంట్స్ చూడలేకపోయాం!!
on Oct 1, 2022

టీవీ షోస్‌తో పాటు మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్స్ లో సుమ సందడి మాములుగా ఉండదు.. వెరైటీ కామెడీతో ఆ కార్యక్రమం మొత్తాన్ని హుషారుగా ముందుకు తీసుకెళ్లడంలో సుమది అందె వేసిన చెయ్యి అని చెప్పొచ్చు. ఐతే ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఐనా సరే.. సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తుంది సుమ.
కానీ ఇప్పుడు అక్టోబర్ 5న రిలీజవుతున్న 'గాడ్‌ఫాదర్', 'ది ఘోస్ట్' మూవీస్ ప్రిరిలీజ్ ఈవెంట్స్ లో సుమ కనిపించలేదు. ఈ విషయంపై చాలా మంది ఫీల్ అయ్యారు. "సుమక్క ఉంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అన్నట్టే.. ఎందుకంటే అంత జోష్ తో ప్రోగ్రాం చేస్తుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఐతే ఇదే టైములో సుమ కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ కి వెళ్లినట్టుంది. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్‌ను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ తో షేర్ చేసుకుంది. సుమ లేకపోవడం వలన ఆమె ప్లేస్ లో వేరే యాంకర్స్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు.
ఐతే వెకేషన్ ఫొటోస్ చూసిన నెటిజన్స్ మాత్రం "సుమక్కా! నువ్వు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నావా.. 'గాడ్ ఫాదర్', 'ఘోస్ట్' మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నువ్ లేకపోయేసరికి ఆ ప్రోగ్రామ్స్ మేం చూడలేకపోయాం. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హోస్ట్ గా నిన్ను తప్ప ఎవరినీ చూడలేం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



