ప్రేమ లేదని ప్రేమించరాదని.. త్వరలోనే నేహా చౌదరి నవల!
on Feb 15, 2026

బుల్లితెర మీద నేహా చౌదరి(Neha Chowdary) గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ఆమె బిబి జోడిలో విశ్వాతో కలిసి జోడి కంటెస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తోంది. ఐతే ఆమె గతంలో ఒక నవల రాస్తున్నట్టు ప్రకటించింది. దానికి సంబంధించిన ఒక అప్ డేట్ ని రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది.
"ప్రేమ లేదని, ప్రేమించరాదని. ప్రేమంటే కేవలం డోపమైన్ చేసే మాయ అని, అదొక బయోలాజికల్ ట్రాప్ అని అసహ్యించుకునే ప్రాక్టికల్ జర్నల్లిస్ట్ అపర్ణ ఒకవైపు. ప్రేమంటే మనిషిని నడిపించే అద్భుత శక్తి అని నమ్మి, ఆ ప్రేమని కెమెరాలో బంధించాలనుకునే ఆప్టిమిస్టిక్ ఫిల్మ్ మేకర్ అనిరుధ్ మరోవైపు. ఏడేళ్లుగా మనసులో దాచుకున్న ప్రేమని గెలిపించుకోవడానికి అనిరుధ్ చేసే ప్రయత్నం, గతం చేసిన గాయాల వల్ల ప్రేమనే ద్వేషించే అపర్ణ చేసే ప్రయాణం. ఈ ఇద్దరి మధ్య జరిగే ‘లాజిక్ వెర్సెస్ మ్యాజిక్’ ప్రేమ యుద్ధమే - ప్రేమ లేదని, ప్రేమించరాదని. రేపట్నుంచి అపర్ణ, అనిరుధ్ మీకు చాలా దగ్గరవుతారు." అంటూ తాను రాసిన అపర్ణ నవలలోని లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసింది నేహా చౌదరి.
అలాగే ఇంకేమందంటే "నిజానికి ఈ రోజుకే కాపీలు రావాల్సింది. కానీ ఒక వైపు బిబి జోడి బిజీ షెడ్యూల్, మరో వైపు బుక్ ఫైనల్ ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఈ రోజు ఫైనల్గా ప్రింట్ కి వెళ్లింది. చాలా త్వరలో బుక్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఈ రోజు నుంచే ప్రీ -ఆర్డర్స్ ఓపెన్ . ప్రీ -ఆర్డర్ చేసిన వాళ్లకి నేను పర్సనల్ గా సైన్ చేసిన కాపీస్ ని పంపిస్తాను నన్ను నమ్మి, నా నవలను ప్రచురిస్తున్న టీమ్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత ప్రేమతో, ఇంత ఓపికగా ఎదురు చూసిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలా త్వరలో నా సైన్డ్ కాపీ మీ చేతుల్లో ఉంటుంది." అంటూ పోస్ట్ చేసింది.
ఇక నెటిజన్స్ ఐతే ఈ బుక్ ఎక్కడ ఎప్పుడు దొరుకుంటుంది. బుక్ చదవడం కోసం చాల వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నేహా చౌదరి స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉండేది అలాగే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కూడా. ఐతే గతంలో నీతోనే డాన్స్ 2 .0 లో విశ్వాతో కలిసి జోడిగా పెర్ఫార్మ్ చేసింది కానీ మధ్యలోనే క్విట్ అయ్యింది. మెడ దగ్గర ఇంజురీ కావడంతో రెస్ట్ తీసుకోమంటూ డాక్టర్స్ చెప్పారని చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



