అనసూయ కోరిక తీరేనా..?
on Jan 17, 2023
.webp)
అనసూయ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కోపం వస్తే శివంగి లేదంటే చాలా కూల్ అని. బుల్లితెర మీద అనసూయ గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ కూడా ఉన్న యాంకర్. ఇక ఈమె బుల్లితెర మీద యాంకర్ గా చేయడం మానేసి సిల్వర్ స్క్రీన్ మీద మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేస్తోంది. రీసెంట్ గా ఈమె టేస్టీ తేజతో కలిసి "సంక్రాంతి స్పెషల్ లంచ్ " అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది.
తేజ ఆమెను ఎన్నో ప్రశ్నలు కూడా వేసాడు. మీ డ్రీం రోల్ ఏమిటి ? ఇలా ఇండస్ట్రీలో కి వస్తానని అనుకున్నారా ? అని. దానికి అనసూయ ఆన్సర్స్ ఇచ్చింది. "ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. కానీ అది ఛాలెంజింగ్ గా లీడ్ రోల్ లా ఉండాలి. ఆ పాత్రకు నేను మాత్రమే సూట్ అవుతాను అనే ఒక థాట్ రైటర్ లో, డైరెక్టర్ లో రావాలి. అలా వెర్సటైల్ రోల్స్ లో నటించాలని నా కోరిక. ఏ ఫిలిం మేకర్ కి ఐనా సరే నేను ఒక సేఫ్ యాక్టర్ గా ఉండడం నాకు ఇష్టం...అలా ఉంటే చాలు నా డ్రీం ఫుల్ ఫీల్ ఐనట్టే. అసలు నేను యాక్టర్ అవుతానని, ముఖానికి రంగులు పూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నేను ఆర్థోడాక్స్ ఫామిలీలో పుట్టాను. పద్ధతి తప్ప పాడు అనే మాట కూడా మా ఇంట్లో వినిపించదు. మా పేరెంట్స్ దగ్గరకు వెళ్లిప్పుడు అక్కడి పద్ధతులు, మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులు కచ్చితంగా ఫాలో అవుతాను.
నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నాన్నగారు వాళ్ళది భూదాన్ పోచంపల్లి. అమ్మ వాళ్ళది కర్ణాటక. తాతయ్య వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్స్ టైంలో ఘట్ కేసర్ కి వచ్చేసారు. నాన్నగారు నాకు పర్మిషన్ ఇచ్చాకే కెమెరా ముందుకు వచ్చాను అది కూడా న్యూస్ రీడర్ గా. అలా మెల్లగా నా దారిలో నేను అవకాశాలను అందుకుంటూ ఇంతదూరం వచ్చాను. నేను ఏం చేసినా మా నాన్నకి సంతోషమే ఎందుకంటే నాకు లోకజ్ఞానం ఎక్కువ అని అనుకుంటారు. అంతేకాదు నా మీద నాకు చాలా గర్వంగా కూడా ఉంటుంది. సంకల్పం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనేది నా గట్టి నమ్మకం. వికీపీడియాలో మా ఆయన పేర్లు పిచ్చిపిచ్చిగా రాసేశారు. దాన్ని అసలు నమ్మకూడదు. అసలు ఇంటరెస్టింగ్ విషయం చెప్పాలంటే నేను, మా ఆయన లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నాం. మా పేరెంట్స్ ని డబ్బులు పెట్టడానికి మేం ఒప్పుకోలేదు. ఎన్ సీసీ క్యాంపులో మాకు పరిచయమయ్యింది. ఎనిమిదేళ్లు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం ". అని చెప్పింది అనసూయ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



