షోకి పిలిచి ఇలా కాంట్రవర్సీ ప్రశ్న వేస్తారా ? ఆలీ మీద ఫైర్ ఐన అల్లు అరవింద్
on Oct 6, 2022
.webp)
ఆలీతో సరదాగా షో గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రతీ వారం కొత్త కొత్తగా సాగిపోతోంది. ఇక ఇప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు. "అరవింద్ గారి ఫామిలీకి, చిరంజీవి గారి ఫామిలీకి మధ్య చిన్న డిస్టర్బన్స్ వచ్చింది ఏమిటది " అని ఆలీ అడిగేసరికి " మీరు కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడుగుతాను అంటే అవి ముందు చెప్పండి అన్నాను..ఆబ్బె ఏమీ లేదండి సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉన్నాయన్నారు.
అందులో ఇదొకటా" అంటూ ఆలీ మీద సీరియస్ అయ్యారు అల్లు అరవింద్. ఇక తన మనవరాలు గురించి ఎక్కువ చెప్పకూడదు కానీ అల్లు అర్హ చాలా తెలివైనది, అల్లరిది అని చెప్పారు. "మీ నాన్నగారు ఎప్పుడైనా తెలివిగలవాడేనా అని మిమ్మల్ని చూసి అనుకున్నారా" అని అడిగేసరికి "అనుకునే ఉంటారు.
ఎందుకంటే నాకు 18 ఏళ్ళ వయసున్నప్పుడు ఫైనాన్సియల్ గా కొన్ని సలహాలు అడిగేవారు. చిన్నప్పుడు ఎవరో ఒక షూటింగ్ కోసం 12000 మాత్రమే ఇస్తానన్నారు. ఐతే నాన్నకు 15000 కావాలి కాబట్టి సింగల్ పేమెంట్ తీసుకుని షూటింగ్ ఐపోయేంత వరకు ఉంచుకుని ఇంటరెస్ట్ వేసి 15000 అడుగు. సరిపోతుందని సలహా ఇచ్చా" అన్నారు అల్లు అరవింద్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



