స్కూల్ లో ఉన్నప్పటినుంచే ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్నా
on Dec 26, 2024
ఇష్మార్ట్ జోడి 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వెడ్డింగ్ థీమ్ ఇచ్చాడు హోస్ట్ ఓంకార్. ఐతే కంటెస్టెంట్స్ అంతా కూడా పెళ్లి దుస్తుల్లో అచ్చమైన పెళ్ళికొడుకు పెళ్లి కూతుళ్లలా వచ్చారు. ఇందులో అలీ రెజా, మాసుమా చానా అందంగా మురిసిపోయారు. ఇక ఓంకార్ అలీ రెజాని ఒక వెరైటీ ప్రశ్న అడిగాడు . "ఫస్ట్ నైట్ కోసం ఈ ఏజ్ నుంచి ఎదురు చూస్తున్నావు" అని. దానికి "స్కూల్ ఏజ్ నుంచే" ఆన్సర్ చెప్పాడు అలీ రెజా. "ఫస్ట్ నైట్ రోజు ఎనర్జీ కోసం ఏదైనా స్పెషల్ ఫుడ్ తిన్నారా" అని అడిగాడు. "ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ ఉంటది కదా సర్. అది మా దగ్గర నుంచే వెళ్తుంది" అన్నాడు అలీ రెజా.
దానికి వెంటనే మాసుమా " స్ట్రాంగ్ మ్యాన్ అన్నా" అంటూ తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంది. తర్వాత అలీ రెజా పేరెంట్స్ వచ్చారు.. వాళ్ళ నాన్నను పరిచయం చేసాడు అలీ. "నా వయసు 69 . కానీ ఇప్పటికీ స్ట్రాంగ్" అన్నాడు. దానికి ఆటగాడే అన్నారంతా. సీరియల్ నటుడుగా మెప్పించిన అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అలరించాడు. ఒకానొక టైంలో అలీ రెజా విన్నర్ రేస్‌లోకి వచ్చాడు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ ఐపోయాడు. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ.. విన్నర్ రేస్‌లో కి రాలేకపోయాడు. అలాంటి అలీ రెజా ఇప్పుడు ఇష్మార్ట్ జోడి 3 లో అలరించడానికి వచ్చాడు.
Also Read