ఆదిత్య ఓం ఎలిమినెటెడ్.. మెగా ఛీఫ్ గా నబీల్!
on Oct 4, 2024
బిగ్ బాస్ హౌస్ లో నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. నైనిక, ఆదిత్య ఓం, విష్ణుప్రియ బాటమ్ లో ఉండగా.. లీస్ట్ ఓటింగ్ లో నిలిచింది ఆదిత్య ఓం అని ప్రకటించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత హౌస్ లో ఛీఫ్ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
పప్పీల టాస్క్ లో భాగంగా ప్రేరణ-నబీల్ మిగిలారు. వీరిలో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని నిర్ణయించండని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అటు ప్రేరణ.. ఇటు నబీల్ ఇద్దరూ హౌస్‌మెట్స్‌కి తమ క్వాలిటీస్ చెప్పారు. నా వల్ల నా క్లాన్ వాళ్లకి చాలా ఇరిటేషన్ వచ్చింది.. కానీ తప్పు చేస్తే నా వాళ్ల మీదైనా నేను గట్టిగా అరుస్తా.. కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నా.. ఈ అయిదు వారాల్లో నా హార్డ్ వర్క్ కనిపించి ఉంటే సపోర్ట్ చేయమని ప్రేరణ అంది. మరోవైపు నబీల్ కూడా తన వెర్షన్ చెప్పుకున్నాడు. ఫస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు మీరంతా కొత్తకొత్తగా ఉండే.. నేను అలవాటు పడ్డా.. అందరితో మాట్లాడతా ప్రతిరోజూ, ఎవరైనా ఫీల్ అవుతుంటే నేను మోటివేట్ చేస్తా.. అందరితో అంతగా కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు కానీ మీ అందరి మంచి, చెడులు నాకు తెలుసు.. ఏ తప్పు చేయకుండా ది బెస్ట్ ఇస్తా అని మాటిస్తున్నంటూ నబీల్ అన్నాడు. బ్యాలెన్స్ సిచువేషన్ వచ్చినప్పుడు నబీల్ బెటర్ అంటూ సీత చెప్పింది. నబీల్ ఫాలో చేస్తాడు కమాండ్ చేయడు.. కనుక ప్రేరణ బెటర్ అంటూ యష్మీ అంది. ఇక ఆదిత్య కూడా ప్రేరణకే సపోర్ట్ చేశాడు. ఇక నబీల్‌కి నిఖిల్ మద్దతు ఇస్తూ ఇక ఉండేది ఒకటే చీఫ్..8 మందిని హ్యాండిల్ చేయాలి.. అది ప్రేరణ వల్ల అవుతుందని అనుకోవడం లేదంటూ నిఖిల్ అన్నాడు. ఇలా హౌస్‌లో ఎక్కువ మంది సభ్యులు నబీల్‌కి సపోర్ట్ చేయడంతో చీఫ్ కంటెండర్‌గా నబీల్ సెలక్ట్ అయ్యాడు.
చీఫ్ కంటెండెర్స్ అయిన నబీల్-పృథ్వీలకి బిగ్‌బాస్ టాస్కు ఇచ్చాడు. రాజయ్యేది ఎవరంటూ సాగే ఈ టాస్కు గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు.. ఇది గెలవాలంటే బ్లాక్స్‌ను సరైన సెంటైన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలి.. వాటి కోసం అడ్డంకులు దాటుకుంటూ వెళ్లాలి.. మొదటి బ్లాక్స్‌ను సంపాదించడానికి పాకుతూ వెళ్లాలి.. తర్వాత సాండ్ బాక్స్‌లో ఉన్న బ్లాక్స్ తీసుకోవాలి.. తర్వాత స్క్రూను తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ తీసుకొని.. చివరిగా జిగ్ జాగ్ దాటుకుంటూ బ్లాక్ స్టాండ్ దగ్గరికెళ్లి సెంటైన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలి.. ఎవరు ముందుగా పెడతారో వాళ్లే మెగా చీఫ్ అవుతారు.. ఈ టాస్కుకి ప్రేరణ సంచాలక్.. అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఐయ్ మెగా చీఫ్ 'I am Mega Chief' అనే సెంటెన్స్‌ను ఫామ్ చేయడంలో తప్పు చేశాడు. I తర్వాత స్పేస్ ఇవ్వకుండా am పెట్టాడు. కానీ నబీల్ లేటు అయినా కరెక్ట్‌గా పెట్టడంతో నబీల్ విన్నర్ అంటూ ప్రేరణ ప్రకటించింది.
Also Read