నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు..ఆయన లేకపోవడం బాధాకరం
on Sep 21, 2022

ఒకప్పటి అందాల నటి గీత గురించి చెప్పాలంటే ముందుగా సాగర సంగమం సినిమా గుర్తొస్తుంది. తన కెరీర్ లో ఎన్నో మూవీస్ లో నటించింది గీత. ఇక ఇప్పుడు ఈమె ఆలీతో సరదాగా షోకి వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ షో ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు. " డాన్స్ రాదంటున్నారు.. సాగర సంగమంలో కమల్ హాసన్ పక్కన ఎలా చేశారు ?" అని ఆలీ అడిగేసరికి "నేనెక్కడ డాన్స్ చేసాను..కమల్ హాసన్ గారు డాన్స్ చేస్తుంటే నేను అటు ఇటు పరిగెత్తాను అంతేగా" అంటూ నవ్వుతూ చెప్పింది గీత. " చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఉండిపోయిందట..అని అడిగేసరికి ఆయన నా ఆల్ టైం ఫెవరేట్" అని చెప్పింది గీత.
"ఫస్ట్ మీరు కెమెరా ముందుకు వచ్చిన సినిమా మన ఊరి పాండవులు కదా" అని ఆలీ అడిగేసరికి "నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు.. ఈ రోజున ఆయన లేరు అంటే మనసుకు చాలా బాధగా ఉంది. అందరూ వచ్చి ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి సడెన్ గా ఆయన లేరు అంటే తట్టుకోవడం కష్టంగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గీత. "శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేసాను. అప్పట్లో డైలాగ్స్ అరచేతిలో రాసుకుని ఏడుస్తూ డైలాగ్స్ చెప్పేసరికి అదే యాక్టింగ్ అన్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా ప్రామ్ప్టింగ్ అడుగుతున్నారు". "అప్పట్లో ఇండస్ట్రీ లో అందరూ మంచి డాన్సర్ అనేవారు కదా" అని ఆలీ అడిగేసరికి "తల కొట్టుకుని అయ్యో దేవుడా..పేడలో కాలేసి బయటికి వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా డాన్స్ " అని చెప్పింది గీత.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



