హీరోయిన్ కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు
on Dec 28, 2024
నటి ఆమని గురించి పెద్దగా చెప్పక్కరలేదు. తెలుగులో శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పుకొచ్చారు. "కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు సావిత్రి గారి టైం నుంచి ఉంది. ఐతే అప్పట్లో సోషల్ మీడియా అనేదే లేదు కాబట్టి ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీలో హీరోస్ కి కాదు హీరోయిన్స్ కి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ప్రతీ హీరోయిన్ వెనక వాళ్ళ కష్టం, వాళ్ళ కథ ఉంటుంది. ఏ ప్రొఫెషన్ లో ఐనా కానీ మంచి, చెడు ఉంటాయి. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెట్టే కంపెనీస్ లో పెద్దగా సమస్యలు ఉండవు.. కానీ చిన్న చిన్న కంపెనీలు వస్తాయి. హీరోయిన్ ఛాన్సెస్ ఇస్తామంటారు.
మనం మన అమ్మనో, అన్ననో, తమ్ముడినో తీసుకెళ్తాం. వాళ్ళ ముందే టు పీసెస్ వేయాలంటారు. కాళ్ళ మీద స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి ఒకసారి డ్రెస్ తీసి చూపించండి అని వాళ్ళ ముందే అడుగుతూ ఉంటారు. అలా ఎలా చూపిస్తాం. పెద్ద కంపెనీకి వెళ్ళా నేను ఆడిషన్ కోసం..అక్కడ వాళ్ళు డాన్స్ చేసి, యాక్టింగ్ చేసి చూపించమని అడిగారు . అది సినిమాకు సంబంధించి డైలాగ్ ఎలా చెప్తారు అని అడిగారు తప్ప వేరే ఏమీ అడగరు. అప్పుడు మనకు కంపెనీని బట్టి ఎవరు మంచిగా ఉంటున్నారో ఎవరు చెడుగా ప్రవర్తిస్తున్నారో తెలిసిపోతుంది. నేను స్విమ్ సూట్ షూటింగ్ టైంలో వేసుకుంటా కానీ ఇంతమంది ముందు బట్టలు విప్పి చూపించను , కుదరదు అని లేచి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా ట్రయల్స్ చేస్తున్న టైంలో హీరోయిన్ గా పెట్టి అడ్వాన్స్ చెక్ ఇచ్చి రెండో రోజు మేనేజర్ ఇంటికి వచ్చి ఫైనాన్సియర్ వచ్చారు మీ అమ్మగారితో కాకుండా మిమ్మల్నే రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు నాకు విషయం అర్ధమయ్యింది. దాంతో రాను అని చెప్పేసాను. హీరోయిన్ కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా" అంటూ చెప్పారు ఆమని.
Also Read