పాములకు, నాకు విడదీయరాని బంధం!
on Sep 9, 2022

సాయికిరణ్ సింగర్ గా, నటుడిగా అందరికీ పరిచయమున్న వ్యక్తి. "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో అప్పట్లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఐతే సాయికిరణ్ కి దైవ భక్తి చాలా ఎక్కువ. ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన ఎన్నో పాముల్ని కూడా పట్టి అడవుల్లో వదిలినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"ఒక రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఒక పెద్ద తాచుపాము రోడ్డు మధ్యలో ఉండేసరికి అక్కడివాళ్లంతా చంపుదామని తరుముతున్నారు. ఆల్రెడీ అప్పటికే నాలుగు దెబ్బలు కొట్టేసారు. దాంతో అది ఫుల్ కోపంలో ఉంది. అది చూసి నేను వాళ్లకు తమిళ్ లో చెప్పాను చంపొద్దని. నేను పట్టుకుందామని వెళ్లేసరికి అది నా మీద బుసలు కొట్టింది దాంతో వాళ్ళు దాన్ని చంపేశారు. ఆ ఘటన చూసాక నాకు స్నేక్ పార్క్ పెట్టి వాటిని కాపాడాలని అనుకున్నా. కానీ ప్రభుత్వం నుంచి ఎన్నో పర్మిషన్లు తెచ్చుకోవాలి అదంతా ఎందుకు అని పాముల్ని ఎలాగయినా కాపాడాలనే సంకల్పంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఆర్గనైజషన్ లో చేరాను. ఆ తర్వాత ఎన్నో పాముల్ని కాపాడాను. చిరంజీవి, నాగార్జున, పవన్కళ్యాణ్ గారి ఇళ్లల్లోంచి ఎన్నో పాముల్ని బయటికి తీసి అడవిలో వదిలాను. ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఐతే ఎన్నో పాముల్ని కాపాడాను. ఈ సంస్థలో చేరిన 12 నుంచి 15 ఏళ్లలో దాదాపు 3 వేల పాముల వరకు పట్టాను. వాటిని గోనెసంచుల్లో వేసుకుని తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తాం. ఒకసారి ఒక గోనెసంచిలో 16 పాముల్ని తీసుకెళ్ళాం అక్కడ వదిలేద్దామని. ఐతే పాములు ఆ సంచిలో పాస్ పోసేసరికి కింద గోనెసంచి తడిసిపోయి తాళ్లు ఊడిపోయాయి..ఆ విషయం నాకు తెలియక పైన మూత తీస్తున్నా.. ఇంతలో కింద నుంచి ఆ పాములన్నీ నా కాళ్ళ మీద పడిపోయాయి. అప్పుడు ఆ విషయం తెలిసి మా అమ్మ తిట్టింది. ఇదంతా నీకవసరమా అని అప్పుడు ఇదంతా థ్రిల్ అమ్మా కిక్కు..అనేవాడిని ..కానీ తర్వాత నాకూ అనిపించింది ఇదంతా అవసరమా" అని. అలా పాములతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు సాయికిరణ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



