Eto Vellipoindhi manasu: సీతాకాంత్ ప్రయత్నాలు కనిపెట్టేసిన రామలక్ష్మి.. డేంజర్ లో వాళ్ళిద్దరు!
on Apr 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు(Eto Vellipoindhi Manasu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-372 లో సీతాకాంత్, తమ పోలీస్ ఫ్రెండ్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. రామలక్ష్మి చూసి.. ఏంటి ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉన్నారని అడుగగా.. ఎస్ ఈ రోజునా రోజు.. అలాగే ఉండాలని అంటాడు. ఇక రామలక్ష్మి చూసి మళ్ళీ ఏదో ప్లానింగ్ తో వచ్చాడని అనుకుంటుంది. మీరు లండన్ వెళ్ళాక ఆ రియల్ ఎస్టేట్ రంగా గానీ అతని అనుచరులు గానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయండి అని ఎస్సై చెప్తాడు. అది విన్న రామలక్ష్మి.. మీ నెంబర్ నా దగ్గర లేదని చెప్తాడు. మీలాంటి వాళ్ళ కోసం నా వాడి దగ్గర విజిటింగ్ కార్డులు ఉంటాయని సీతాకాంత్ అనగానే.. తన విజిటింగ్ కార్డ్ తీసి రామలక్ష్మికి ఇస్తాడు ఎస్సై.
ఇక కాసేపటికి ఆ విజిటింగ్ కార్డ్ మీద నా పర్సనల్ నెంబర్ లేదు .. ల్యాండ్ లైన్ నెంబర్ ఉందని వేరే కార్డు ఇస్తూ రామలక్ష్మికి ఇచ్చిన కార్డుని ఎస్సై ఇవ్వమంటాడు. ఇక సీతాకాంత్ సంతోషం చూసిన రామలక్ష్మికి డౌట్ వస్తుంది. తనకిచ్చిన కార్డ్ మీద పౌడర్ చల్లి ఉండటం గమనించి దానిని గాల్లోకి ఊదేస్తుంది. దాంతో సీతాకాంత్, ఎస్సై కంగారుపడతారు. మీరు నన్ను దొంగలా చూస్తున్నారా అంటూ ఎస్సైని రామలక్ష్మి నిలదీస్తుంది. దాంతో వీరి గురించి పై అధికారులకి చెప్తానని ఫణీంద్ర, సుశీల అంటారు. దాంతో వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ పౌడర్ చల్లారేమో.. మాకు తెలియదు ..మేము ప్యూర్ గా మీకు సహాయం చేయాలనుకున్నామంటూ
సీతాకాంత్ కవర్ చేస్తాడు. కాసేపటికి ఎస్సై, సీతాకాంత్ బయటకు వచ్చేస్తారు. ఇకనుండి సీతాకాంత్ తో జాగ్రత్తగా ఉండమని ఫణీంద్ర చెప్తాడు.
మరోవైపు సీతాకాంత్ తన పోలీస్ ఫ్రెండ్ తో మాట్లాడతాడు. నీ వల్ల నా పరువు పోయదని, తను రామలక్ష్మి కాదని మైథిలీ అని సాక్ష్యం ఉందని ఎస్సై దగ్గరున్న రామలక్ష్మి సర్టిఫికేట్లు ఇస్తాడు. అవి చూసిన సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు బొకే పట్టుకొని రామలక్ష్మి ఇంటికెళ్తాడు సీతాకాంత్. ఈ రోజు నీ బర్త్ డే కదా పార్టీ లేదా అని సీతాకాంత్ అనగానే ఉంది ఎందుకు లేదని రామలక్ష్మి కవర్ చేస్తుంది. మరి నాకు ట్రీట్ లేదా అని సీతాకాంత్ అంటాడు. ఏం కావాలని రామలక్ష్మి అడుగగా ఈవినింగ్ కలుద్దామని అంటాడు. ఇక రామలక్ష్మి, సీతాకాంత్ కార్ లో సిటీ అవుట్ స్కట్స్ కు వెళ్తారు. ఇక తరువాయి భాగంలో వాళ్లు వెళ్తున్న కార్ మధ్యలో ఆగిపోతుంది. కార్ లో మరే స్టెప్నీ కూడా ఉండదు దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ కంగారుపడతారు. ఇక ఒకతడిని కలిసి అడుగగా మెకానిక్ ఊళ్ళో ఉంటాడని చెప్తాడు. అప్పటిదాకా తన ముసలమ్మ ఇంట్లో ఉండమని అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
