ప్రేరణ నా ఫ్రెండ్ కాదు.... ఇది ఇంత లేటుగానా చెప్పాల్సింది!
on Oct 16, 2024
బిగ్ బాస్ లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. సోమవారం రోజు కొంతమంది నామినేట్ కాగా మిగతా హౌస్ మేట్స్ ని మంగళవారం నాటి ఎపిసోడ్ లో చేశారు. అయితే ఈ వారం నామినేషన్ రసవత్తరంగా సాగింది. నామినేషన్ కంటే ముందు ఈ వారం ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మీ.. ఇద్దరు, ముగ్గురు హౌస్ మేట్స్ తో డిస్స్కస్ చేసింది.
ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే ముందు వెళ్లి హ్యట్ పట్టుకుంటారో వాళ్ళకి ఇద్దరిలో ఎవరివి వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే వాళ్ళని సెలక్ట్ చేసుకోవాలి. ఇంకా హ్యట్ తీసుకున్న వారిని నామినేట్ చెయ్యకూడదు. అయితే ప్రేరణ హరితేజ ఇద్దరు హ్యట్ తీసుకుంటున్నారు. ప్రేరణకి హెల్ప్ చెయ్యాలని యష్మీ ట్రై చేస్తుంది. అయితే హ్యట్ ఒకసారి పృథ్వి తీసుకొని.. హరితేజకి ఇవ్వగా యష్మీ ఏడుస్తుంది. దాంతో యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేస్తాడు. నువ్వు ప్రేరణని నామినెటే చేస్తానని చెప్పావ్ కానీ ఇప్పుడు ప్రేరణ నామినేషన్ లోకి రావద్దని అనుకుంటున్నావు.. ఏడుస్తున్నావ్.. ఎందుకు ఒక ఫ్రెండ్ షిప్ మాస్క్ వేసుకోవడమని తేజ అంటాడు. ఒకరిని ఫ్రెండ్ అనుకుంటే నామినేషన్ చెయ్యరు ఎందుకంటే నామినేషన్ అనేది వాళ్ళని హౌస్ నుండి బయటకు పంపించాడానికే కదా అని తేజ అంటాడు. నాకు ప్రేరణ ఒక పది సంవత్సరాల నుండి ఏం ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్ కాదు.. అసలు ఫ్రెండ్.. కాదు యాక్షన్ రూమ్ లో ఫ్రెండ్ ఎవరని అడిగితే కూడా నేను తన పేరు చెప్పలేదు. మీరు ఫ్రెండ్ టాగ్ లైన్ యూజ్ చెయ్యకండి అని తేజపై యష్మీ అరుస్తుంది. ఆ తర్వాత ఇద్దరి నామినేషన్ ల రీజన్ విన్న హరితేజ.. తేజ ది వాలిడ్ అనిపించింది. ఫ్రెండ్ అని చెప్పి అలా చెయ్యడం కరెక్ట్ కాదని, అది నాకు నచ్చలేదని తేజ నామినేషన్ ని హరితేజ కన్సిడర్ చేస్తుంది.
ఆ తర్వాత ఇంకొకరి నామినేషన్ లో నేను మాట్లాడొచ్చా అంటూ ప్రేరణ కలుగుజేసుకొని మాట్లాడుతుంది. ప్లీజ్ యష్మీ ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడకండి. తను నాకు ముందే చెప్పింది సిచువేషన్ వస్తే నా గేమ్ నేను ఆడుతానని చెప్పింది కాబట్టి నేను తనని అర్థం చేసుకున్నానని ప్రేరణ అనగానే ఈ విషయం ఆ నామినేషన్ అప్పుడే చెప్తే నా ఆలోచన వేరే విధంగా ఉండేది కదా ఇప్పుడు చెప్పావ్.. ఆల్రెడీ యశ్మీ నామినేట్ అయ్యాక చెప్పావ్.. టూ లేట్ అని హరితేజ అంటుంది. ఇదేం ట్విస్టో ఏమో.. ప్రేరణ కోసం నిలబడ్డ టేస్టీ తేజ, హరితేజలు రాంగ్ అంటూ ప్రేరణ అనడంతో హౌస్ అంతా షాక్ అయ్యారు.
Also Read