ముగిసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ...విన్నర్ గా నిలిచిన సౌజన్య
on Jun 5, 2023
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఐకానిక్ ఫినాలేలో ధూమ్ ధామ్ గా జరిగింది. ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. దాదాపు 12 మంది ఈ పోటీకి అర్హత సాధించగా ఫైనల్ కి ఐదుగురు వచ్చారు. న్యూ జెర్సీకి చెందిన డాక్టర్ శ్రుతి, హైదరాబాద్ నుంచి జయరాం, కార్తీక్, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల ఫైనల్స్ కి వచ్చారు. ఫైనల్ ఎపిసోడ్ లో టైటిల్ విన్నర్ గా సౌజన్య ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీని అల్లు అర్జున్, గీతామాధురి, కార్తీక్, థమన్ అందించారు. "సౌజన్య నీకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పేరెంట్స్ మనకు ఎలాగో సపోర్ట్ చేస్తారు. కానీ భర్త, అత్తగారు, మావగారు సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు ఇప్పుడు చాల మందికి ఇన్స్పిరేషన్ వి అవుతావు" అని చెప్పారు అల్లు అర్జున్. అలాగే 10 లక్షల చెక్కుని కూడా అందించారు.
ఆ చెక్కుని సౌజన్య వాళ్ళ పాపకు అందించారు అర్జున్...తర్వాత ఫస్ట్ రన్నరప్ గా జయరాంకి 3 లక్షల చెక్కుని, సెకండ్ రన్నరప్ గా లాస్యకు 2 లక్షల చెక్కుని అందించారు. "నేను ఫస్ట్ టైం మిమ్మల్ని లైవ్ లో యాంకరింగ్ చేయడం చూస్తున్నాను. నువ్వు హోస్టింగ్ బాగా చేసావ్..మూవీస్ కి కూడా హోస్టింగ్ చేయాలి" అని హేమచంద్రకి కాంప్లిమెంట్ ఇచ్చారు అలాగే "ఈ షో నాకెంతో స్పెషల్ థింగ్ , మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఎప్పటికీ. సౌజన్యకు అభినందనలు" అన్నారు అల్లు అర్జున్. 'తెలుగు ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే సెకండ్ సీజన్ అంతకు మించిన జోష్ ని ఫన్ ని మంచి టాలెంట్ ఉన్న సింగర్స్ ని ఇండస్ట్రీకి అందించింది. ఇక ఇప్పుడు 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' పూర్తయ్యింది