Brahmamudi : రాజ్ కి మినిస్టర్ బిడ్డని ఇస్తాడా.. రుద్రాణి ప్లాన్ ఏంటి!
on Feb 7, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -949 లో.....రాజ్, కావ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ రోజుతో ఆ మినిస్టర్ కి మనం అంటే ఏంటో తెలిసిందని రాజ్ అంటాడు. ఏమో అండి వాడి భార్య మీద ఉన్న ప్రేమ వాడి బలహీనత..అది కాస్త వాడి ధైర్యం అయితే మనం ఏం చెయ్యలేమని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య తరుచుగా తులసి దగ్గరికి వస్తుంది. ఇద్దరు క్లోజ్ అవుతారు. కావ్య రోజు ఇంటికి వస్తుంటే మినిస్టర్ కి భయం వేస్తుంది. రోజులు గడిచే కొద్దీ భయం పెరుగుతుంది.
మినిస్టర్ నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు.. ఇలా భయం భయంగా బ్రతకడం నా వాళ్ళ కాదని అనుకుంటాడు. నా భార్యకి నిజం చెప్తానని మినిస్టర్ ఫిక్స్ అవుతాడు. దాంతో ఆ రోజు రాత్రి తులసి దగ్గరికి వెళ్తాడు. నువ్వు కావ్యకి హెల్ప్ చేయమన్నావ్ కదా.. ఆ బిడ్డను మార్చిన అతను ఏ పరిస్థితిలో మార్చాడో మనకి తెలియదు కదా అని మినిస్టర్ అనగానే ఏ పరిస్థితి ఏంటి అలా చేయడం తప్పు.. వాడు కనిపిస్తే చెప్పుతో కొడతానని తులసి అంటుంది. ఆ పని మీరు చేసినా నేను ఊరుకోను.. అయినా మీరు అలా చేస్తే నేను బ్రతుకుతానా అని తులసి అనగానే మినిస్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజ్ కి ఫోన్ చేసి కలవాలని అంటాడు.
రాజ్ నేను నా బిడ్డ ని నీకు ఇవ్వలేనని మినిస్టర్ అంటాడు. నీ బిడ్డ కాదు మా బిడ్డ అని రాజ్ అంటాడు. నా భార్య బిడ్డకి దూరంగా ఉండి ఎంత బాధ పడుతుందో మీకేమైనా తెలుస్తుందా అని రాజ్ కోప్పడుతాడు. మీరే నా బిడ్డని తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని రాజ్ అంటాడు. ఆ తర్వాత మినిస్టర్, రుద్రాణి మాట్లాడుకుంటారు. మనం చేసింది తప్పు అని మినిస్టర్ అనగానే అలా వెనకడుగు వేస్తారేంటని రుద్రాణి అంటుంది. తప్పు అయినా నీ భార్య హ్యాపీగా ఉంది కదా అని మినిస్టర్ ని రుద్రాణి కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మికి రుద్రాణి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



