వంటలక్కకి ఇంతపెద్ద కొడుకు ఉన్నాడా... షాక్ లో నెటిజన్లు!
on Jul 8, 2024
ప్రేమి విశ్వనాథ్ అనే పేరు కంటే కార్తీకదీపం వంటలక్క అంటే తెలుగు సీరియల్స్ అభిమానులకి బాగా తెలుసు. ఆమె ఆ సీరియల్ చేసిన నటనకు తెలుగు వాళ్లు ఫిధా అయ్యారు. అయితే తను మలయాళ నటి.
కొంతకాలం క్రితం కార్తీక దీపం సరికొత్తగా ఇది నవ వసంతం అంటూ మళ్లీ బుల్లితెర ఆడియన్స్‌ను పలకరించింది. మరోసారి డాక్టర్ బాబు (పరిటాల నిరుపమ్)తో కలిసి ఈ ధారావాహికలో నటిస్తుంది ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపం మొదటి భాగానికి దీనికి పేర్లు తప్ప కథకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆడియన్స్ దీన్ని కొత్త సీరియల్గానే చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రేటింగ్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే ప్రేమి-నిరుపమ్‌ల నటన కోసం మాత్రం బుల్లితెర ఆడియన్స్ ఈ సీరియల్‌ను బాగానే చూస్తున్నారు.
తాజాగా వంటలక్క తన కొడుకుతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో చేసింది. దీనికి 'మామ్ అండ్ సన్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రేమి విశ్వనాథ్. తన కొడుకు అయితే ఫుల్ ఫిట్‌గా హీరో లెవల్లో ఉన్నాడు. చూడటానికి చాలా స్టైల్‌గా కనిపించాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మేడమ్ మీకు ఇంత పెద్ద కొడుకున్నాడా, బ్రదర్ అండ్ సిస్టర్లా ఉన్నారు, సంతూర్ మమ్మీ, అసలు అనుకోలేదు మీ కొడుకని అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ప్రేమి కొడుకు అయితే చూడటానికి అదిరిపోయాడు. మరి సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తున్నాడో లేదో ప్రేమియే చెప్పాలి.
ఇక వంటలక్క పర్సనల్ లైఫ్ గురించి ఆడియన్స్‌కి పెద్దగా ఏం తెలియదు. ఆమెది కేరళ అని మాత్రమే తెలుసు.. కానీ ఆమె ఫ్యామిలీ ఏంటి? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక ఆమె తాజాగా తన కొడుకును అభిమానులకి పరిచయం చేసింది. ఎప్పుడూ పెద్దగా ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయని వంటలక్క.. తన కొడుకుతో కలిసి చేసిన ఈ రీల్ ట్రెండింగ్ లో ఉంది. మరి వంటలక్క కొడుకు ఎలా ఉన్నాడో మీరు చూసారా? కామెంట్ చేయండి.
Also Read