పట్టువదలని విక్రమార్కులు...కామెడీతో రోహిణి!
on Nov 22, 2024
బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త, చివరి మెగా చీఫ్ అయ్యేందుకు తాజాగా ఓ టాస్కు జరిగింది. పోటీదారులు మెగా చీఫ్ అయ్యేందుకు 'పట్టువదలని విక్రమార్కులు' అనే టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఈ టాస్కులో గెలిచేందుకు కంటెస్టెంట్లు తమ పట్టు వదలకుండా రంగు ప్లాట్‌ఫామ్‌పై తాడును పట్టుకొని నిలబడాలి అంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో చీఫ్ కంటెండర్లు అయిన టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మీ పోటీపడ్డారు. ఇక ఈ టాస్కుకి గౌతమ్‌ని సంచాలక్‌గా పెట్టాడు బిగ్‌బాస్. ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న డైస్‌ని రోల్ చేశాడు. అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌పై ఉన్న వారికి పోటు పడినట్లే. అంటే వాళ్లు నిల్చున్న డ్రమ్‌ని గౌతమ్ పీకేస్తాడన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే.. అక్కడ ఐదుగురికి కలిపి రెండు కలర్ డ్రమ్స్ మాత్రమే ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో గౌతమ్ ఏ కలర్ వస్తే ఆ రంగు డ్రమ్‌పై ఉన్న వాళ్లని తీసేయొచ్చు. కానీ గౌతమ్ పక్షపాతం చూపించి ముందు మనల్నే లేపాస్తాడంటూ కన్నడ బ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. దీంతో వారందరికీ షాకిస్తూ డైస్ మీద నంబర్లు వేశాడు.
కానీ డైస్ తిప్పేసరికి మొదట పృథ్వీ నంబర్ వచ్చింది. దీంతో పృథ్వీ కిందున్న డ్రమ్ తీసేశాడు గౌతమ్. దీంతో గాల్లో కాసేపు తాడు పట్టుకొని వేలాడిన పృథ్వీకి యష్మీ తను నిల్చున్న డ్రమ్‌పై చోటిచ్చింది. దీంతో యష్మీని పట్టుకొని నిల్చున్నాడు పృథ్వీ. ఇది చూసి ఇదేనా యష్మీ నువ్వు చెప్పిన ఇండివీడ్యూవల్ గేమ్ అంటూ రోహిణి కౌంటర్ వేసింది. ఆ తర్వాత రోహిణి కింద డ్రమ్ పోయేసరికి వెళ్లి టేస్టీ తేజ పక్కన సెట్ అయిపోయింది. ఇక తేజ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లు తెగ ఫీల్ అయిపోయాడు.
బిగ్‌బాస్ నా కల నెరవేర్చినందుకు థాంక్యూ అంటూ తేజ అన్నాడు. ఇక టాస్క్ లో విష్ణు గేమ్ నుంచి ఔట్ అయింది. ఆ వెంటనే యష్మీ కిందున్న డ్రమ్ తీసేయడంతో పృథ్వీ-యష్మీ ఇద్దరూ కాసేపు వేలాడారు. కానీ ఇక ఉండలేక యష్మీ ముందు పడిపోయింది.. ఆ వెంటనే పృథ్వీ వదిలేశాడు. ఇక ఈ గేమ్‌లో తేజ విన్ అయ్యాడు. దీంతో తేజకి 50 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువసేపు ఉన్న రోహిణికి 40, నెక్ట్స్ ఉన్న పృథ్వీకి 30, యష్మీకి 20, విష్ణుప్రియకి 10 పాయింట్లు వచ్చాయి. ఇలా మెగా చీఫ్ టాస్కులో ఓ గేమ్ పూర్తయింది.
Also Read