శ్రీలంక పోయి జిమ్ చేయాలా..అంత రిచ్చా ?
on Oct 15, 2024
సోషల్ మీడియా ఇప్పుడు ఎలా ఉంది అంటే నెటిజన్స్ సలహాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఏదైనా వీడియో పెట్టిన పోస్ట్ పెట్టిన అలా ఎందుకు ఇలా ఎందుకు అంటారు. ఇప్పుడు యాంకర్ గాయత్రీ భార్గవి విషయంలో కూడా అదే కామెంట్ ఎదురయ్యింది. ఈ మధ్య లేడీ సెలబ్రిటీస్ కి ఆరోగ్యం మీద మక్కువ ఎక్కువయ్యింది.. జిమ్ చేస్తూ కనిపిస్తున్నారు. నటి ప్రగతి, యాంకర్ అనసూయ, సుమ, ఇప్పుడు మరో యాంకర్ గాయత్రీ భార్గవి..ఇలా లేడీస్ అంతా జిమ్ చేస్తూ ఆ పోస్ట్స్ ని సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇక నెటిజన్స్ కామెంట్స్ ఐతే మాములుగా ఉండడం లేదు. గాయత్రీ భార్గవి అలాగే పోస్ట్ జిమ్ వీడియోని పోస్ట్ చేసేసరికి ఒక నెటిజన్ ఏమన్నారంటే " కళ్లపు చల్లి ముగ్గులు వేయడం మానేసి ఇలాంటివి మీకెందుకు" అని అడిగేసారు.. ఇక మరో నెటిజన్ ఐతే "ఏంటి మళ్ళీ రి-ఎంట్రీనా ఏంటి టీవీ షోలోకి" అని అడిగేసారు. అలాగే శ్రీలంకపై అని ఆమె డిపి కింద కనిపించేసరికి "ఏమిటి మీరు శ్రీలంక పోయి జిమ్ చేస్తారా మీరు బాగా రిచ్ అన్న మాట" అంటూ కామెంట్ చేసారు. ఇక గాయత్రీ భార్గవి ప్రముఖ దర్శకుడు బాపు మనవరాలని తెలుసు. ఈమె చాలా తక్కువ టైమ్‌లోనే యాంకర్‌గా, నటిగా ఇండస్ట్రీలో ఒక స్తానం ఏర్పాటు చేసుకున్నారు. అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, నచ్చింది గాళ్ ఫ్రెండు, మర్డర్ వంటి సినిమాల్లో నటించారు.