AP రాజకీయాలపై మురళి మోహన్ కోడలు.. నేను మీలా కాదు!
on Apr 3, 2024
నటుడు, నిర్మాత మురళీమోహన్, 50 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. మురళీ మోహన్ మొత్తం 350 సినిమాల్లో నటించారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడ ప్రజలకు సేవలందించారు. మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా 20 సినిమాలు కూడా నిర్మించారు. అలాంటి మురళి మోహన్ ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. "మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ అందుకే నా పేరు రాజా రామ్ మోహన్ రాయ్ అని పెట్టారు. మా తమ్ముడి పేరు వేణు గోపాల్ తిలక్. నా పేరు అంత పెద్దగా ఉండేసరికి అందరూ చిన్నగా రాజబాబు అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఆ పేరే ఉండిపోయింది. నా పాస్పోర్ట్ లో మురళి మోహన్ అలియాస్ రాజబాబు అని ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ఒక శ్రీరామచంద్రడు ఎవరంటే మురళి మోహన్ అంటూ నా గురించి అమెరికాలో ఒక స్టేజి మీద అక్కినేని నాగేశ్వరావు గారు చెప్పేసరికి నేనే షాకైపోయా. అది ఆయన సత్కార సభ. అలాంటి సభలో ఆయన నా గురించి మాట్లాడ్డం నా అదృష్టం. అక్కినేని గారు నాకు ఆరాధ్య దైవం. చిన్నప్పటినుంచి నేను ఆయన ఫ్యాన్ ని. సావిత్రి గారన్నా కూడా చాలా ఇష్టం. వాళ్ళు ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఏదైనా కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. రిపీటెడ్ గా చూడాల్సిందే. అలాంటి వ్యక్తిని చూడగలనా, మాట్లాడగలనా, షేక్ హ్యాండ్ తీసుకోగలనా అని అనుకున్నాను.
కానీ నేను సినిమా యాక్టర్ ని అయ్యాక ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలా నా గురించి తెలుసుకున్నారాయన. నా గురించి అంత గొప్పగా కాంప్లిమెంట్ ఇచ్చాక సర్ సర్ అన్నా..నువ్వూరుకో నాకు తెలుసు నీ గురించి ...నేను నీలా శ్రీరామా చంద్రుడిని కాదు నేను అందరినీ గోకుతా ఉంటా అన్నారు అక్కినేని. మా మనవరాలు రాగా పెళ్లి కీరవాణి గారి అబ్బాయి శ్రీసింహతో ఈ ఏడాది చివరిలో చేస్తున్నాం. " అంటూ చెప్పారు మురళి మోహన్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళిమోహన్ కొడలు నేటి రాజకీయాల గురించి మాట్లాడటం విశేషం.
Also Read