ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.. త్వరలో కెరీర్ మీద ఫోకస్
on Mar 13, 2025
బుల్లితెర మీద బ్రహ్మముడి మానస్ చాలా ఫేమస్. మానస్ సీరియల్స్ లో నటిస్తూ ఉంటాడు. అలాగే ఈవెంట్స్ లో ఇంకా రకరకాల ఆల్బమ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. కోయిలమ్మ, మానసిచ్చి చూడు వంటి సీరియల్స్ తో పేరు తెచ్చుకున్నాడు అలాగే నీతోనే డాన్స్ 2 .0 లో కూడా ఫైనల్స్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు డాన్స్ ఐకాన్ లో సాధ్వి అనే డాన్సర్ కి మెంటార్ గా ఉన్నాడు. అలాగే విష్ణుప్రియతో కలిసి కొన్ని డాన్స్ ఆల్బమ్స్ కూడా చేసాడు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. 'విష్ణుప్రియకు, నాకు అలా సెట్ ఐపోయింది. జరీ జరీ పంచె కట్టు సాంగ్ చేసాం . అది 70 మిలియన్ వ్యూస్ వెళ్లాయి. తర్వాత వచ్చిన గంగులు ఆల్బం సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. "మా కాంబినేషన్ అలా హిట్ అయ్యింది. వేరే ఏదొచ్చినా చేస్తాం" అని చెప్పాడు మానస్. విష్ణు ప్రియా ఏదైనా చేయగలదు. ఆమె ఎంత ప్యాషనేట్ పర్సన్ అనేది బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి కూడా బాగా తెలిసి వచ్చింది. ఇక మా అబ్బాయి ఆరు నెలల పిల్లాడు.
పేరు ధ్రువ.. తనతో బాగా టైం స్పెండ్ చేస్తున్నా...ఎంత వర్క్ ఉన్నా ధ్రువకి కూడా టైం కేటాయిస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళాక వాళ్ళతోనే ఇక అన్నాడు. అలాగే మానస్ తన వైఫ్ శ్రీజ గురించి కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది. కొంతకాలం అయ్యాక ఆమె తన కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. ఈరోజున యూత్ అంతా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ వెళ్తున్నారు. త్వరలో శ్రీజ కూడా బాబు కొంచెం ఒక ఏజ్ కి రాగానే తన కెరీర్ మీద ద్రుష్టి పెడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. బుల్లితెర మీద బ్రహ్మముడి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు మానస్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
