llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!
on Dec 23, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో... ధీరజ్ మళ్ళీ ఎందుకు వచ్చాడంటూ రామరాజు గొడవ పెడుతుంటే.. వద్దని వేదవతి ఆపుతుంది. వాడు తప్పు చేసాడని వద్దని అంటున్నారు. మరి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు రానిచ్చారని వేదవతి అడుగుతుంది. రామరాజు ఆలోచలలో పడి.. సరే ఇక ముందు వాడు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి చెప్తానని రామరాజు అంటాడు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య నేనే హెల్ప్ చేస్తే చివరికి నన్నే వెళ్ళమంటారా అని నర్మద అంటుంది. దాంతో నీకు నాకు మాటలు లేవు అంటూ వెళ్ళిపోతుంది వేదవతి.
మరుసటి రోజు ఉదయం నర్మద ఇంటి ముందు ముగ్గువేస్తుంది. అవతల వైపు సేనాపతి భార్య ముగ్గు వేస్తుంది. అప్పుడే తన దగ్గరికి ప్రేమ వచ్చి.. అమ్మ నేను ముగ్గు వేస్తానంటుంది. ప్రేమ ముగ్గు వేస్తు నర్మదతో మాట్లాడుతుంది. ఆ ధీరజ్ గాడిని ఇంట్లోకి రప్పించే ప్రయత్నం చేయకు నర్మద అని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. వాడెలా వచ్చాడని ప్రేమ అనగానే.. నేనే తీసుకొని వచ్చానంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ లు గొడవపడుతు.. ప్రేమ ముగ్గు తప్పు వేస్తుంటే అయ్యో ముగ్గు తప్పు వేస్తున్నావంటూ నర్మద గీత ధాటి వస్తుంది. దంతో సేనాపతి కొడుకు చూసి.. గొడవకి దిగుతాడు. దాంతో ఆ ఇంట్లో వాళ్ళు.. ఈ ఇంట్లో వాళ్లందరు వస్తారు.
భద్రవతి టైమ్ దొరికింది కదా అని రామరాజుని తిడుతుంది. దాంతో తనకి ఇదంతా తెలియదని సారీ చెప్తున్నానని సాగర్ అనగానే.. మీ నాన్న చెప్పాలని భద్రవతి అంటుంది. రామరాజు క్షమాపణ అడుగుతాడు. దాంతో భద్రవతి కుటుంబం సంతోషపడుతుంది. మరొకవైపు నర్మద బాధపడుతుంటే.. ధీరజ్ వచ్చి అసలు గొడవేంటో చెప్తాడు. అత్తయ్య ఎక్కడ అంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది నర్మద. తరువాయి భాగంలో రామరాజు ఇంట్లో పూజ జరుగుతుంటే.. ప్రసాదరావు పోలీసులని తీసుకొని వస్తాడు. నర్మదని ట్రాప్ చేసి బలవంతంగా నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడంట.. అంతా నీ వల్లే అంట అని రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read