Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!
on Jan 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.
కావ్య వెళ్ళిపోయాక అక్కడే దాక్కొని ఉన్న రుద్రాణి బయటకు వస్తుంది. అదేంటి మినిస్టర్ అని మర్చిపోయి మాట్లాడుతుంది అని రుద్రాణితో మినిస్టర్ అంటాడు. అది అలాగే మాట్లాడుతుందని రుద్రాణి అంటుంది. మరొకవైపు కావ్య కోసం ఇంట్లో అందరు వెయిట్ చేస్తుంటారు. కావ్య రాగానే ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఈ రోజే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని పాపని తీసుకొని కావ్య లోపలికి వెళ్తుంది. ఇక కావ్యని బయటకు పంపించకపోవడమే మంచిది అని రేఖ అంటుంది.
ఆ తర్వాత రేఖకి రుద్రాణి ఫోన్ చేసి.. నేను చెప్పినట్లు చేస్తున్నావా అని అడుగుతుంది. ఆ కావ్యకి పాప గురించి నిజం తెలిసిపోయిందని రుద్రాణి చెప్పగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ కి కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. అదంతా నేను నమ్మలేకపోతున్నా కావ్య.. అలా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోతాడు. మీరు నాతో నా బిడ్డ దగ్గరికి రండి అంతా అర్ధమవుతుందని కావ్య అనగానే రాజ్ సరే అంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని తీసుకొని మినిస్టర్ ఇంటికి వెళ్తుంది కావ్య. మినిస్టర్, తులసి భోజనం చేస్తుంటే.. వాళ్లకి తెలియకుండా పాప దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



