దీప, శౌర్యలని తీసుకొని బయటకొచ్చేసిన కార్తీక్.. తను పగతీర్చుకుంటుందా!
on Dec 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -234 లో..... కార్తీక్ కట్టుబట్టలతో వెళ్పోతానని శివన్నారాయణతో అంటాడు. నువ్వేమంటావ్ అమ్మ అనగానే.. నీ మాటే నా మాట అని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప, అనసూయలని వాళ్లకు సంబంధించినవి తెచ్చుకోమంటాడు. ఆ తర్వాత దశరత్ వస్తాడు. ఏం జరుగుతుందని అనగానే.. బావ వాళ్లు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాడని జ్యోత్స్న అనగానే వద్దని దశరథ్ అంటాడు.
దీప, అనసూయలు బ్యాగ్ తీసుకొని వస్తారు. కార్తీక్ తన ఒంటి మీద ఉన్నా బంగారం పర్సు అంత అక్కడ పెడతాడు. కాంచన కూడా తన మీద ఉన్న బంగారం అక్కడ పెడుతుంటే.. ఇవన్నీ నీవి అని దశరథ్ అంటాడు. కాదని నాన్న అంటున్నాడని కాంచన ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత శౌర్య దగ్గరికి వెళ్లిన కార్తీక్ నిద్రపోతుంటే లేపి బ్యాగ్, టాబ్లెట్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన జ్ఞాపకం అయిన లాకెట్ ని బీరువా నుండి తీసుకుంటాడు. ఇక మీ వంటూ మా దగ్గర ఏమీ లేవని దీప, శౌర్యలని కార్తీక్ తీసుకొని బయటకు వెళ్తు.. గుడ్ బై మై డియర్ మరదలా అని జ్యోత్స్నతో అంటాడు. ఆ తర్వాత ఇంటివైపు చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అసలైన వారసురాలు కట్టుబట్టలతో బయటకు వెళ్తుంది. బావ నా ఇగో మీద దెబ్బ కొట్టావ్.. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను.. దీప నీ లేకుండా చేసి నిన్ను నా సొంతం చేసుకుంటానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ, జ్యోత్స్న, దశరత్ లు ఇంటికి వెళ్ళగానే.. అక్కడ ఏం గొడవ జరగలేదు కదా అని సుమిత్ర అడుగుతుంది. ఇంట్లో నుండి వెళ్లిపోయారని దశరథ్ అనగానే.. మీరు ఎలా చూస్తూ ఉన్నారని సుమిత్ర అనగానే.. తాతయ్య మీద కోపంతో వెళ్ళిపోయాడని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read