పాముని మెడలో వేసుకొని ముచ్చటిస్తున్న హిమజ!
on Jun 4, 2023
హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో నటించిన హిమజ.. మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది.
హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.
అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే హిమజ.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అదేంటంటే న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఒక కొండచిలువని మెడలో వేసుకొని ఫోటోలకి ఫోజ్ ఇచ్చింది. కొండచిలువని ముద్దుపెట్టుకోమని వీడియో తీస్తున్న ఫ్రెండ్ అనగా.. భయమేసి వద్దని చెప్పింది. అయితే హిమజ ఏదో ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే అదేం సినిమా అని ఇంకా అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. అయితే హిమజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ముక్కు బాలేదు, కళ్ళు బాలేదని డైరెక్టర్లు చెప్పేవారంట.. అలాంటిది ఇప్పుడు స్క్రీన్ మీద తన కళ్ళే బాగుంటాయని చెప్తున్నారంట. ఇలా హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తూ ప్రతీ అప్డేట్ ని షేర్ చేసుకుంటుంది.
Also Read