ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయిన బ్రహ్మముడి కావ్య పోస్ట్.. ఆంద్రప్రదేశ్ మంత్రులతో ఫోటోలు!
on Dec 22, 2024
బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైంది దీపిక రంగరాజు. కావ్య పాత్రలో రాజ్ అలియాస్ మానస్ కి జోడీగా నటిస్తున్న ఈ బ్యూటీ.. సీరియల్ లో తెలుగింటి ఆడపడుచులా కన్పిస్తుంది. ఇక బయట రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కన్పిస్తూ తన అల్లరితో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మరోసారి ఫేమస్ అయ్యింది.
ఇక తాజాగా కావ్య అలియస్ దీపిక రంగరాజు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో జరిగిన ఓ కార్యక్రమానికి గెస్టుగా వెళ్లిన దీపిక.. ఆ ఈవెంట్‌కి సంబంధించిన విశేషాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులైన వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడితో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. పవర్ఫుల్ హోంమంత్రి అంటు ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణహత్యలు నిర్మూలిద్దాం.. స్త్రీ జాతిని సమున్నతం చేద్దాం- హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడదాం- భవిష్యత్తు భారాతావనిని ఆదర్శంగా తీర్చిదిద్దుదామంటూ ఓ మంచి సంకల్పంతో పాలకొల్లులో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లులో ఈ నెల 15న జరిగిన 'సేవ్ ద గర్ల్ చైల్డ్' 2కే రన్ కార్యక్రమంలో దీపిక పాల్గొంది. ఈ సందర్భంగా దీపికని స్టేజ్‌పై సత్కరించారు మంత్రి నిమ్మల.
గౌరవనీయులైన మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. మీరు నిజంగా చాలా మంచి మనిషి. ఇంత సింపుల్‌గా ఉండే రాజకీయ నాయకుడ్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అలానే పవర్ఫుల్ లేడీ, హోంమంత్రి అయిన వంగలపూడి అనిత మేడమ్‌కి కూడా చాలా థ్యాంక్స్. అలానే నా ఫేవరెట్ సింగర్ మధుప్రియని, టాలెంటెడ్ క్యూట్ వాగ్దేవిని కూడా అక్కడ కలిసినందుకు సంతోషంగా ఉంది. నాపైన ఇంత ప్రేమ చూపించిన పాలకొల్లు ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ దీపిక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
Also Read