బ్రహ్మముడి టెలికాస్ట్ టైమింగ్ మారనుందా.. ఇక టీఅర్పీ గోవిందా!
on Dec 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ బ్రహ్మముడికి యమ క్రేజ్ ఉంది. కానీ దానిని మధ్యాహ్నానికి మార్చేశారు. దాని టీఆర్పీ గోవింద అయింది. ఇప్పుడేమో రాత్రి 10.30 గంటలకు సీరియల్‌ని రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయిన బ్రహ్మముడి సీరియల్‌ని తిరిగి రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. కాబట్టి మధ్యాహ్నం మిస్ అయితే రాత్రి చూడొచ్చన్నమాట. కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్స్ స్టార్ మా టైమింగ్స్‌ని మార్చేస్తోంది. ఏ కొత్త సీరియల్ వచ్చినా దాన్ని మంచి ప్రైమ్ టైంలో వదిలి ఆ టైమ్ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్‌ని మధ్యాహ్నానికి తోసేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ విషయంలో ఇదే స్ట్రాటజీతో బొక్క బోర్లాపడ్డ స్టార్ మా.. మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ విషయంలోనే అదే చేసింది.
అప్పట్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ని రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యేది. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్‌ని బద్దలు కొట్టేసింది గుప్పెడంత మనసు. ఆ తరువాత కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. మధ్యాహ్నానికి మార్చేశారు. దాంతో గుప్పెడంత మనసు టీఅర్పీ పడిపోయింది.
ఇప్పుడు ‘బ్రహ్మముడి’ సీరియల్‌ని అలాగే చేస్తున్నారు. ప్రారంభంలో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అయ్యేది బ్రహ్మముడి. స్టార్ మా ఛానల్లో ఆ టైమ్‌లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ అంటే సూపర్ హిట్ కిందే లెక్క. కార్తీకదీపం అదే టైమ్ లో ప్రసారమయ్యే జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఆ సీరియల్ అయిపోయిన తరువాత అదే టైమ్ లో రాత్రి 7. 30 గంటలకు బ్రహ్మముడి సీరియల్‌ని ప్రసారం చేశారు. ఈ సీరియల్ కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని నమోదు చేసింది. అంతకముంది స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్స్ రేటింగ్‌లో బ్రహ్మముడికే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చేది. ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ టాప్ వన్ స్థానంలో నిలిచింది. ప్రైమ్ టైంలో 13-14 తక్కువ కాకుండా టీఆర్పీ రేటింగ్ వచ్చే బ్రహ్మముడి మధ్యాహ్నానికి మార్చేసరికి సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేసేకంటే.. యధాస్థానంలో అంటే రాత్రి 7.30 గంటలకు ప్రసారం చేస్తేనే బ్రహ్మముడి మళ్ళీ ఆ టీఆర్పీని సొంతం చేసుకోవచ్చు.